వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్బీఐ చేతికి కొరడా: మొండి బకాయిలు, కార్పొరేట్లకు శివరాత్రులే

బ్యాంకులు దేశంలోని ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను అవసరమైన వారికి రుణాలుగా ఇస్తుంటాయి. అప్పులు వసూలు కాకపోతే బ్యాంకుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్యాంకులు దేశంలోని ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను అవసరమైన వారికి రుణాలుగా ఇస్తుంటాయి. అప్పులు వసూలు కాకపోతే బ్యాంకుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో మొండి బకాయిలు పెరగకుండా బ్యాంకుల యాజమాన్యాలు ఒకింత జాగ్రత్త పడుతున్నా.. ఇటీవల పరిస్థితి విషమిస్తున్నది. కొంత కాలంగా దేశీయ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో భారీగా మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. గమ్మత్తేమిటంటే రుణాలు ఎగ్గొడుతున్న వారిలో బడా కార్పొరేట్లు కూడా ఉండటం గమనించదగ్గ పరిణామమే మరి.

బడుగు జీవులు, రైతులు, చిన్నాచితకా వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు తీసుకునే రుణాల వసూళ్ల విషయంలో బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు.. కార్పొరేట్ల రుణాల వసూలులో మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నాయి. మొండిబాకీల సమస్య మరింత జఠిలంగా మారుతోంది. వాటి ఉనికి ప్రశ్నార్థకమయ్యే స్థాయికి బ్యాంకుల రుణాలు చేరాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా పరిణమించాయంటే అతిశేయోక్తి కాదు. ఏదోవిధంగా ఆయా రుణాల వసూళ్లకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ), కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేశాయి.

అందుకోసం రుణ వసూళ్ల కోసం కేంద్రం ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థకు గుదిబండలా మారిన మొండి బకాయిలను రాబట్టుకోడానికి పెద్ద ముందడుగు పడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)కు ఈ విషయంలో విస్తృతాధికారాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ, ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. కొత్త అధికారాలు వచ్చిన వెంటనే ఆర్‌బీఐ స్పందించింది. నిబంధనల్లో అవసరమైన మార్పులు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

 17 శాతానికి చేరిన ఎన్‌పీఏలు

17 శాతానికి చేరిన ఎన్‌పీఏలు

బ్యాంకింగ్ భాషలో మొండి బకాయిలు అంటే నిరర్థక ఆస్తులే అని అర్థం. 2016 సెప్టెంబర్ నాటికే బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు రమారమీ రూ.9.7 లక్షల కోట్లని తేలింది. బ్యాంకులిచ్చిన మొత్తం రుణాల్లో మొండి బకాయిల వాటా 17 శాతానికి పెరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్థూల మొండి బకాయిల వాటా 12 శాతం కావడం గమనించదగ్గ పరిణామం. 15 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్థూల మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) 10 శాతం కంటే ఎక్కువగానే అధికంగా ఉన్నాయి. యూకో బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వాటా 39.23 శాతంగా ఉన్నాయి. బడా కార్పొరేట్ సంస్థలు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్న విమర్శలు ఉన్నాయి.

సగానికి పైగా బడా కార్పొరేట్ల రుణాలే

సగానికి పైగా బడా కార్పొరేట్ల రుణాలే


స్టీల్ తయారీ రంగం, విద్యుత్, వజ్రాలు, రత్నాభరణాలు, టైక్స్ టైల్, మౌలిక వసతులు, నిర్మాణ రంగం, స్పిన్నింగ్ మిల్లులు, మైనింగ్ రంగ పరిశ్రమల యాజమాన్యాలు తీసుకున్న భారీ రుణాలు చెల్లించడంలో వెనుకంజ వేస్తున్నాయి. దాదాపు 100 బడా కార్పొరేట్ సంస్థలు తీసుకున్న మొండి బకాయిల్లో సగానికి పైగా ఉండడం గమనార్హం. ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులకే మొండి బకాయిల బెడద ఉన్నదని వాస్తవాలు చెప్తున్నాయి.

ఏడు శాతానికి చేరిన ప్రైవేట్ బ్యాంకులు

ఏడు శాతానికి చేరిన ప్రైవేట్ బ్యాంకులు


ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిల్లో చిక్కుకున్న వాటిలో ఐసీఐసీఐ బ్యాంకు మొదటి స్థానంలో ఉన్నది. ఈ మొండి బకాయిలు సుమారు 7 శాతం కాగా, యాక్సిస్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్ తర్వాతీ స్థానంలో ఉన్నాయి. ఇచ్చిన రుణాలు వసూలు కాక కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు వీలు చిక్కడం లేదు. బ్యాంకులు ఇప్పటివరకు ఆస్తుల భారం తగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయడమే లేదని విమర్శలు ఉన్నాయి. రుణ వసూళ్లకు దిగితే చట్టపరంగా అవరోధాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నాయి. నిబంధనల ప్రకారం అప్పులు ఇచ్చిన బ్యాంకులు సంబంధిత సిబ్బందిని బాధ్యతాయుతులను చేయడంతో కేసులు, కోర్టులను ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొన్నది.

ఆర్బీఐ, బ్యాంకులదీ ఒకే విధానం

ఆర్బీఐ, బ్యాంకులదీ ఒకే విధానం

వివిధ మొండి బకాయిల వసూలునకు తాజాగా కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌తో ఆర్బీఐ కీలక పాత్ర పోషించనున్నది. నిరర్థక ఆస్తుల విషయంలో సరికొత్త నిర్ణయాలు తీసుకునే వీలు ఉన్నది. ఏదైనా బ్యాంకు మీన మేషాలు లెక్కిస్తుంటే ఆర్బీఐ నేరుగా రంగంలోకి దిగేందుకు వెసులుబాటు లభిస్తుంది. అన్ని బ్యాంకులకు గల మొండి బకాయిల వసూళ్ల విషయంలో ఆర్బీఐ, సంబంధిత బ్యాంకులు ఒకే విధానాన్ని అవలంభించాల్సి ఉంటుంది. మొండి బకాయిల వసూళ్ల ప్రక్రియను గడువులోగా పూర్తి చేయకపోతే బ్యాంకులపై అపరాధ రుసుము విధిస్తామనీ హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పునరుత్తేజానికి ప్రణాళిక' (ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ రీవైటలైజింగ్‌ డిస్ట్రెస్డ్‌ అసెట్స్‌ ఇన్‌ ద ఎకానమీ) కింద సంయుక్త రుణదాతల సంఘం(జేఎల్‌ఎఫ్‌), దిద్దుబాటు చర్యల ప్రణాళిక(సీఏపీ)లో నిర్ణయాన్ని తీసుకునే ప్రక్రియను మరింత సులువు చేస్తున్నట్లు ఆర్బీఐ నోటిపికేషన్ పేర్కొన్నది.

ఆర్బీఐ నేరుగా రంగంలోకి దిగొచ్చు

ఆర్బీఐ నేరుగా రంగంలోకి దిగొచ్చు

రుణ గ్రహీతల నుంచి బకాయిలు వసూలు చేసుకునేందుకు,అవసరమైతే దివాలా ప్రక్రియను మొదలుపెట్టడానికి ఏ బ్యాంకింగ్‌ కంపెనీకి ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేయవచ్చు. ప్రధాన దేశాల్లో ఎక్కడా ఈ స్థాయిలో నిరర్థక ఆస్తులు లేవు. క్రెడిట్‌ సూయిజీ నివేదిక ప్రకారం జీడీపీలో ఇవి 8.4 శాతానికి సమానం. దివాలా స్మృతి (ఐబీసీ) 2016 నిబంధనల కింద ఎగవేతదారులపై దివాలా ప్రక్రియను మొదలుపెట్టడానికి బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసేందుకు ఈ ఆర్డినెన్స్‌ అధికారాలను కల్పిస్తున్నది.

మొండి బకాయిలపై ఆర్బీఐకి ఇలా

మొండి బకాయిలపై ఆర్బీఐకి ఇలా


ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పరిష్కారానికి సైతం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసే విస్తృతాధికారాలు ఆర్‌బీఐకి కట్టబెట్టినట్లయింది. రంగాల వారీగా పరిశీలక సంఘాలను ఏర్పాటు చేసి తద్వారా రుణ పునర్నిర్మాణాలు జరిగినప్పుడు దర్యాప్తు సంస్థల బారి నుంచి కాపాడేందుకు కూడా ఆర్‌బీఐకి అధికారాలొచ్చాయి. ఇప్పటిదాకా ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలకు(మార్కెట్‌ విలువ కంటే తక్కువ విలువకు) మొండి బకాయిలను విక్రయించడం లేదా.. సెటిల్‌మెంట్‌ పథకాల ద్వారా నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరించుకోవడానికి దర్యాప్తు సంస్థల(సీబీఐ, కాగ్‌, కేంద్ర విజిలెన్స్‌ సంఘం) నుంచి కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి. చట్ట సవరణతో ఆర్‌బీఐ కొన్ని నిర్దిష్ట సందర్భాల విషయంలో ప్రత్యేక పరిష్కారాలను చూపడానికి వీలుంటుంది.

మార్గదర్శకాల సడలింపునకు చాన్స్

మార్గదర్శకాల సడలింపునకు చాన్స్

అవసరమైతే ప్రస్తుత మార్గదర్శకాలను సడలించడానికి సైతం ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించడంతో, బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలను తగ్గించుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు గట్టి ఊతం లభించినట్లయింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం ‘1949 లోని సెక్షన్‌ 35 ఏ'ను సవరించే ఈ ఆర్డినెన్స్‌ను వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. వివిధ బ్యాంకులు సూచించిన మొండి బకాయిల కేసులను పరిశీలించడానికి ఆర్‌బీఐ నేతృత్వంలో పలు పరిశీలక కమిటీలను ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మార్చిలో తెలిపిన సంగతి తెలిసిందే.

ఆర్బీఐకి మరిన్ని అధికారాలు దఖలు

ఆర్బీఐకి మరిన్ని అధికారాలు దఖలు

మొండి బకాయిలను గుర్తించి, త్వరితగతిన వాటిని రాబట్టుకోవడానికి ఆర్డినెన్స్‌ ఆమోదంతో ఆర్‌బీఐకి మరిన్ని అధికారాలు కట్టబెట్టినట్లయిందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ‘ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న కొన్ని ఆస్తుల జాబితా ఆర్‌బీఐ వద్ద ఉంది. వాటిని పరిశీలిస్తోంది. ఈ పరిస్థితి కొనసాగకూడదు. పరిష్కారాల్లో భాగంగా ఆస్తుల విక్రయం, లాభాల్లేని శాఖల మూసివేత, వ్యాపారాలు పుంజుకునేందుకు ఇచ్చే అదనపు రుణాల తగ్గింపులు ఉండవచ్చు' అని జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో సమస్యలను పరిష్కరించడానికి ఆర్థిక శాఖ జోక్యం చేసుకున్నప్పటికీ అది ఫలించలేదని ఆయన అన్నారు.

ఎన్ పీఏల వసూలుపై ఎస్బీఐ చైర్‌పర్సన్ ఇలా

ఎన్ పీఏల వసూలుపై ఎస్బీఐ చైర్‌పర్సన్ ఇలా

మొండి బకాయిల సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి ఉన్న దృఢచిత్తానికి తాజా ఆర్డినెన్సు బలమైన నిదర్శనమని ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. సవరించిన నిబంధనల ప్రయోజనాలను త్వరితగతంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ అంది పుచ్చుకోవాలని ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఎన్‌పీఏల నియంత్రణకు సంతృప్తికర పరిష్కారాన్ని కనుగొనేందుకు ఈ ఆర్డినెన్సు దోహదం చేస్తుందని ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య తెలిపారు..

 ఎన్పీఏలపై చందాకొచ్చర్ ఇలా

ఎన్పీఏలపై చందాకొచ్చర్ ఇలా

వివిధ బ్యాంకుల మొండి బకాయిలను నిర్దిష్ట గడువులోగా వసూలు చేసేందుకు ఆర్డినెన్స్ వెసులుబాటు కల్పిస్తుందని ఐసీఐసీఐ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ అభిప్రాయ పడ్డారు. ఆర్థిక రంగంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల్లో ఇది మైలురాయిగా నిలువనున్నదన్నారు. ఆర్బీఐకి పూర్తి అధికారాలు కల్పించడంతో సత్వరం సమస్య పరిష్కారానికి వీలు చిక్కుతుందని ఆమె తెలిపారు.

English summary
The Presidential Ordinance empowering the Reserve Bank of India (RBI) to enforce expeditious resolution of non-performing assets (NPAs) of banks should hardly come as a surprise. For several past weeks, Finance Minister Arun Jaitley has been hinting at this legal empowerment of the central bank to crack down on NPAs of banks, an area where recovery has been a painfully slow process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X