వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి షాక్.. మణిపూర్‌లో కూటమికి గుడ్ బై చెప్పనున్న ఎన్‌పీఎఫ్

|
Google Oneindia TeluguNews

కోహిమా : మణిపూర్‌లో బీజేపీకి మణిపూర్‌లో షాక్ తగిలింది. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించింది. మిత్రపక్షాలను గౌరవించకపోవడం, పొత్తు ధర్మాన్ని విస్మరించడమే కారణమని ఎన్‌పీఎఫ్ తేల్చిచెప్పింది. పాలనలో తామిచ్చే సలహాలు సూచనలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఆపార్టీ అగ్రనాయకలు దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో బంధం తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది.

కోహిమాలోని పార్టీ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం సమావేశమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ నేతలు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అన్ని అంశాలను సమగ్రంగా చర్చించిన అనంతరం చివరకు మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి ఎన్‌పీఎఫ్ తప్పుకున్నా మణిపూర్‌లోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు.

మహిళే ప్రధాని: దీదీనా బెహన్‌జీనా..సోనియా మొగ్గు అటువైపే..?మహిళే ప్రధాని: దీదీనా బెహన్‌జీనా..సోనియా మొగ్గు అటువైపే..?

NPF decided to withdraw its support to the BJP government in Manipur

60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో అధికారం కోల్పోకుండా ఉండేందుకు 31 సీట్లు అవసరం. బీజేపీకి 29 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. ఎన్ఫీఎఫ్‌కు చెందిన నలుగురు, ఎల్జేపీ, ఏఐటీసీకి ఒక్కో ఎమ్మెల్యే, ఓ స్వతంత్ర అభ్యర్థి ఆ పార్టీని సపోర్ట్ చేశారు. ప్రస్తుతం నాగా పీపుల్స్ ఫ్రంట్ కూటమి నుంచి వైదొలిగిన మరో ముగ్రురు ఎమ్మెల్యేల మద్దతున్నందున బీజేపీ బలం 32కు చేరుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఢోకా లేదని విశ్లేషకులు అంటున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 21 స్థానాలు గెల్చుకుంది. గతేడాది కాంగ్రెస్‌కు చెందిన 8మంది ఎమ్మెల్యేలు కమలదళంలో చేరడంతో ఆ పార్టీ బలం 29కి చేరింది.

English summary
Naga People's Front has decided to withdraw its support to the BJP government in Manipur. NPF's decision to withdraw support from the BJP-led coalition government in Manipur was announced by party's spokesperson Achumbemo Kikon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X