వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నార్సీపై చర్చ లేదు: సీఏఏ తీసుకొచ్చాం..అవగాహన పెంచుతాం: అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

ఎన్నార్సీ పైన చర్చలు లేవని..సీఏఏ మాత్రం తీసుకొచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని..తాము ప్రజల్లో ఈ చట్టం పైన అవగాహన పెంచేం దుకు డోర్ టు డోర్ ప్రచరాం చేస్తున్నామని షా చెప్పుకొచ్చారు. ఎన్నార్సీ ఎన్డీఏ అజెండా కాదని స్పష్టం చేసారు. ప్రస్తుతం పౌరసత్వ బిల్లుపైనే చర్చ సాగుతోందని వ్యాఖ్యానించారు. పౌరసత్వ బిల్లు పైన ప్రజలకు ప్రతిపక్షాలు తప్పుడు సమాచారం ఇస్తోందంటూ మండిపడ్డారు.

నగ్నంగా ఉండి చూపించేవారు, కెమెరాలో కూడా ఆ పనులు, పాక్ మంత్రితో హరీమ్ షా టిక్‌టాక్, వైరల్నగ్నంగా ఉండి చూపించేవారు, కెమెరాలో కూడా ఆ పనులు, పాక్ మంత్రితో హరీమ్ షా టిక్‌టాక్, వైరల్

ప్రధాని చెప్పిందే..తానూ

ప్రధాని చెప్పిందే..తానూ

ప్రధానమంత్రి ఇప్పటికే ఎన్నార్సీ పైన చర్చ రాలేదనే విషయాన్ని చెప్పారని షా గుర్తు చేసారు. తాను కూడా అదే విషయాన్ని చెబుతున్నానని.. ఎన్నార్సీ పైన చర్చ లేదని ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా స్పష్టం చేసారు. షా పలుమార్లు ప్రధాని చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఎన్నార్సీ మీద చర్చ జరగటం లేదని పునరుద్ఘాటించారు. అంటే ఎన్నార్సీని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేసినట్లేనా అనే ప్రశ్నకు తాను అలా చెప్పానా అంటూ ఎదరు ప్రశ్న వేసారు. ప్రస్తుతం పౌరసత్వ చట్టంపైనే అవగాహన పెంచుతున్నామని వివరించారు. ప్రజలను ఈ రెండు అంశాల ద్వారా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఈ రెండు అంశాలు వేర్వేరు అని స్పష్టం చేసారు. పౌరసత్వ బిల్లుతో పాటుగా ఎన్నార్సీ అంశం చర్చకు రాదన్నారు. బయట జరుగుతున్న చర్చ కాదని..బిల్లులో పొందు పర్చిన అంశాలను చూడాలని సూచిస్తున్నారు.

ఆ ఇద్దరూ తప్పుడు ప్రచారంతో..

ఆ ఇద్దరూ తప్పుడు ప్రచారంతో..

ప్రియాంకా గాంధీ..రాహుల్ గాంధీ ఇద్దరూ ప్రతీ రోజూ ఈ చట్టం కారణంగా పేదలు పౌరసత్వం కోల్పోతారని చెబుతున్నారని..ఆ అంశం బిల్లులో ఉందా అని షా ప్రశ్నించారు. ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో ప్రజల్లో ఆందోళన రేకెత్తించటంతో నిరసనలు జరుగుతున్నాయని షా వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రతిపక్షాలు ఈ రకమైన రాజకీయం చేస్తాయని తాము అంచనా వేయలేదని చెప్పుకొచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు నిరసనలు జరుగుతున్నాయనే ప్రశ్నకు సమాధానంగా..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఈ ఆందోళనలు లేవో కాంగ్రెస్ ను అడగాలంటూ సూచించారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి రాజకీయ ఆందోళనలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

చిదంబరం నాడు తెచ్చారు..

చిదంబరం నాడు తెచ్చారు..

ఇక, ఎన్పీఆర్ లో ప్రతీ ఏడాది జనాభా లెక్కలు సేకరిస్తారని.. ఇది ఇప్పుడు చేస్తున్నది కాదని..గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేదా..చిదంబరం ఎన్పీఆర్ తీసుకురాలేదా అని షా ప్రశ్నించారు. ఏ కులాన్ని లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసారు. కేవలం డేటా మాత్రమే సేకరిస్తామని.. ఎన్పీఆర్ కు ఎన్నార్సీకి సంబంధం లేదన్నారు. ఇక, నిరసనల పేరుతో విధ్వసానికి కారణమైతే పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. శాంతి భద్రతల విషయంలో ఈ నిరసనల ద్వారా దేశానికి మంచి చేయటం లేదనే విషయం గుర్తించాలన్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల మీద షా ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. వరుస ఓటములకు సమాధానంగా తాము ఓటమి పాలయ్యామని దీని పైన విశ్లేషణ చేసుకోవాల్సి ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని అమిత్ షా స్పష్టం చేసారు.

English summary
Union Home Minister Amit Shah on Thursday said the National Register of Citizens (NRC) was not on the agenda of the government yet. However, asked if it had been put in cold storage, he said he had never said that and added that the CAA should be discussed now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X