వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: డబ్బుల కోసం దత్త పుత్రుడి చంపించిన తల్లిదండ్రులు

డబ్బుల కోసం దత్తత తీసుకొన్న కొడుకును ఎన్ ఆర్ ఐ దంపతులు హత్య చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.కోటి 20 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ముల కోసం ఆ దంపతులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అహ్మాదాబాద్:డబ్బుల కోసం దత్తత తీసుకొన్న కొడుకును ఎన్ ఆర్ ఐ దంపతులు హత్య చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.కోటి 20 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ముల కోసం ఆ దంపతులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

గుజరాత్ రాష్ట్రంలో జానాఘడ్ జిల్లా కెశోద్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఆర్ . డి లోక్ నాథ్ , కన్వల్జిన్హ్ రాయిజాదా దంపతులు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. ఈ దంపతులు పదమూడేళ్ళ గోపాల్ అనే బాలుడిని దత్తత తీసుకొన్నారు.

ఈ బాలుడు ప్రస్తుతం అహ్మదాబాద్ లో ఉంటున్నాడు. అతని పేరున సుమారు కోటి 20 లక్షల ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి.ఈబాలుడిని చంపేస్తే ఈ ఇన్సూరెన్స్ సొమ్మును క్లైయిమ్ చేసుకోవచ్చని ఆ దంపతులు భావించారు.

NRI Couple Allegedly Had Adopted Teen Son Killed For Insurance Money

ఈ మేరకు ఆ బాలుడిని చంపేయాలని కిరాయి హంతకుడితో ఒప్పందం చేసుకొన్నారు. నితీశ్ ముండే అనే వ్యక్తితో ఒప్పందం చేసుకొన్నారు.

నితీశ్ ముండే లండన్ లో ఉండేవాడు. నితీష్ లండన్ నుండి గుజరాత్ కు వచ్చాడు. 2015 లో గోపాల్ ను హత్య చేసేందుకుగాను ఒప్పందం కుదుర్చుకొన్నాడు.ఆ రోజు నుండి ఆయన గోపాల్ ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

2017 ఫిబ్రవరి 8వ, తేదిన జానాఘడ్ జిల్లాలోని కెశోద్ ప్రాంతంలో బాలుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన గోపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు మరణించారు.
అయితే ఈ ఘటనలో నితీష్ ను అరెస్టు చేసి విచారించిన పోలీసులు అసలు విషయం తెలుసుకొని షాక్ తిన్నారు.

English summary
An NRI couple has been charged with murdering of their adopted son, so as to pocket the insurance amount of Rs. 1.20 crore which they had taken as cover for the latter's life, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X