ఎన్నారైల ఓటు హక్కుపై రాజ్యాంగ సవరణ
ప్రవాస భారతీయులు వారి దేశాల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా సవరణలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు వారి దేశాల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా సవరణలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.
ఇటీవల ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించే విషయంపై రాజ్యాంగ సవరణలను చేయాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం స్పందించింది.
రాజ్యాంగ సవరణ చేసే యోచనలో ఉన్నామని మరో రెండు వారాల్లో పూర్తి వివరాలను కోర్టుకు చెబుతామని పేర్కొంది.

విదేశాల్లో ఉంటూ స్వదేశంలో జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ లేదా ఈ బ్యాలెట్ ద్వారా ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసులను సుప్రీం పరిగణలోకి తీసుకుంది.
దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించడానికి కేంద్రం తీసుకున్న చర్యలను, సలహాలను వారం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని సూచించింది. దీనిపై స్పందించిన కేంద్రం పూర్తి వివరాలను మరో రెండు వారాల్లోగా సమర్పిస్తామని తెలిపింది.












Click it and Unblock the Notifications