వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ కశ్మీర్‌కు అజిత్ దోవల్.. పరిస్థితిపై ఆరా...

|
Google Oneindia TeluguNews

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మళ్లీ కశ్మీర్‌ వెళ్లారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన తర్వాత కొద్దిరోజులు కశ్మీర్‌లో ఉండి పరిస్థితిని దోవల్ సమీక్షించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి భద్రతా బలగాల నీడన కశ్మీర్ ఉంది. మళ్లీ ఉగ్రవాదుల చొరబాటు, పీవోకేను స్వాధీనం చేసుకుంటామని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో అజిత్ దోవల్ కూడా కశ్మీర్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. లేదంటే కేంద్రం మళ్లీ ఏదైనా చర్య తీసుకొంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

NSA Ajit Doval back in Srinagar to review security situation ‌

ఆగస్టు 5 నుంచి 11 రోజులపాటు కశ్మీర్‌లో మకాం వేశారు దోవల్. ఆ సమయంలో సోషియన్ పట్టణం, శ్రీనగర్ వీధుల్లో తిరిగారు. జమ్ముకశ్మీర్, సీఆర్పీఎఫ్ బలగాలు, ఆర్మీని ఉద్దేశిస్తూ ప్రత్యేకంగా మాట్లాడారు కూడా. ఆ సమయంలో పరిస్థితిని నిశీతంగా పరిశీలించారు. ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదించారు. ఆయన ఆధ్వర్యంలోనే కశ్మీర్ విభజన తర్వాత కూడా ఎలాంటి అలజడి లేకుండా కశ్మీర్ ఉండగలిగింది. 40 వేల పైచిలుకు సీఆర్పీఎఫ్ బలగాలు అహోరాత్రులు శ్రమిస్తూ కశ్మీర్ భద్రత కోసం సేవలు అందిస్తోంది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదులు, పాకిస్థాన్ దాడులు చేస్తోందా అనే అనుమానంతో భారీగా బలగాలను కేంద్ర ప్రభుత్వం మొహరించింది. 40 వేలకు పైగా సిబ్బంది కశ్మీర్ వీధుల్లో గస్తీ కాస్తున్నారు. గతంలో రాళ్లతో విరుచుకుపడే మూకలు తోకముడిచి పోయారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యే స్థానికులు కూడా విద్య లేదంటే పని బాట పడుతున్నారు. మొత్తంగా కశ్మీర్ అభివృద్ధి దిశగా ముందుకుసాగుతుంది.

English summary
ajit Doval is expected to hold meetings with security forces and state government officials to assess the ground situation as the former state continues to be under security lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X