వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూ-ముస్లిం పెద్దలతో అజిత్ దోవల్ భేటీ, అయోధ్య తీర్పు తర్వాత.. శాంతి, సంయమనమే ఎజెండా..

|
Google Oneindia TeluguNews

అయోధ్య భూవివాద తీర్పు తర్వాత హిందు-ముస్లిం మత పెద్దలతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. అయోధ్య తీర్పు తర్వాత భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దోవల్ కార్యాలయంలో మత పెద్దలతో సమావేశమయ్యారు. 18 మంది హిందు మత పెద్దలు, మేధావులు, 12 మంది ముస్లిం మత పెద్దలు, పండితులు దోవల్‌తో సమావేశమయ్యారు.

మోదీ ఆదేశాలతో..

మోదీ ఆదేశాలతో..

ప్రధాని మోడీ ఆదేశాలతో మత పెద్దలతో దోవల్ సమావేశం నిర్వహించారు. అయోధ్య తీర్పు వచ్చాక సంయమనంగా ఉండాలని.. ఇది ఒకరి గెలుపు, మరొకరి ఓటమో కాదని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మత పెద్దలతో చర్చలు జరిపి పరిస్థితిని సమీక్షించినట్టు తెలుస్తోంది.

వెల్ కం

వెల్ కం

అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పును అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. ఈ క్రమంలో మత పెద్దలతో చర్చలు జరిపి ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలని ప్రధాని భావించారు. దేశంలో శాంతిని పెంపొందించి, ద్వేషానికి తావులేకుండా చూడాలని మత పెద్దలకు ధోవల్ తెలిపినట్టు సమాచారం. చట్టం ముందు అందరూ సమానులేనని.. ఎవరూ అతీతులు కారని స్పష్టంచేశారు.

హిందు ప్రతినిదులు వీరే..

హిందు ప్రతినిదులు వీరే..

హిందు సంస్థల నుంచి శ్రీ అవదేశనంద్ స్వామి, స్వామి పరమత్మానంద, విశ్వేష తీర్థ పెజావర్ స్వామి, స్వామి శ్రూతి సిద్దానంద్, నిర్మలానంద్, బోదశరానందా, మిత్రానంద్, పెరూర్ ఆదీనం, చిన్న రామానూజ జీయర్, చిదానంద్, బాబా రాందేవ్, జనానంద్, జద్గురు శ్రీ శివరాత్రి దీక్షేంద్ర మహాస్వామి, వీహెచ్‌పీ కార్యనిర్వహక అధ్యక్షులు అలోక్ కుమార్, వీహెచ్‌పీ నేతలు చంపాత్ రాయ్, సురిందర్ జైన్, జివేశ్వర్, స్వామి కమల్‌దాస్ తదితరులు హాజరయ్యారు.

ముస్లిం ప్రతినిధులు వీరే..

ముస్లిం ప్రతినిధులు వీరే..

ముస్లిం సంస్థల నుంచి ప్రొపెసర్ అక్తు‌త్రుల్ వాసే, నావైద్ హమీద్, మౌలానా సయీద్ నూరీ, మౌలానా మహముద్ అహ్మద్ ఖాన్ దార్యాబడి, షియా నేత మౌలానా కల్బే జావేద్, జనాబ్ సిరాజుద్దీన్ ఖురేషీ, జనాబ్ ముజ్తాబా ఫరూఖ్, మౌలానా అస్‌ఘర్ అలీ, ఇమామ్ మెహ్దీ సుపీ, సయ్యద్ నసిరుద్దీన్, పీర్ ఫరీద్ అహ్మద్ నిజామీ పాల్గొన్నారు.

English summary
National Security Advisor Ajit Doval held a meeting of religious leaders cutting across faiths. meeting was held at Ajit Doval's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X