వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లు : రంగంలోకి అజిత్ దోవల్.. అర్ధరాత్రి సీలంపూర్‌కు..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. మంగళవారం అర్ధరాత్రి ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫీస్‌కు వచ్చిన దోవల్.. తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ పోలీసులు,కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులను అమిత్ షా మూడోసారి భేటీకి పిలిచిన కొద్దిసేపటికే దోవల్ ఈశాన్య ఢిల్లీకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.

కాగా,పౌరసత్వ వ్యతిరేక,అనుకూల వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలతో రెండు రోజులుగా ఢిల్లీలోని జఫాబాద్,మౌజ్‌పూర్,బబూర్‌పూర్,కరవాల్ నగర్,చాంద్ బాగ్,గోకుల్‌పురి వంటి ప్రాంతాల్లో తీవ్ర హింస చెలరేగింది. ఆందోళనకారులు పారామిలటరీ బలగాలపై యాసిడ్ దాడి కూడా చేశారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో 13 మంది మృతి చెందారు. మృతుల్లో రతన్ లాల్ అనే ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. మరో 150 మంది వరకు గాయపడ్డారు.

NSA Ajit Doval reaches North East Delhis Seelampur to review the situation

Recommended Video

Morning News Round Up | అర్ద‌రాత్రి చ‌ంద్ర‌బాబు తో భేటీ అయిన రాధా రాయబారం నడిపిన ల‌గ‌డ‌పాటి!!

పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. ఒక దశలో హింసను నియంత్రించేందుకు షూట్ ఎట్ సైట్ ఆదేశాలు ఇచ్చినట్టుగా కథనాలు వచ్చాయి. అయితే ఢిల్లీ పోలీస్ కమిషన్ అమూల్య పట్నాయక్ దాన్ని ఖండించారు. అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదన్నారు. మరోవైపు హింసాయుత ఘటనల నేపథ్యంలో రేపు నార్త్ ఢిల్లీ పరిధిలోని 86 సెంటర్స్‌లో జరగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ బోర్డు వాయిదా వేసింది. 10,11,12 తరగతుల పరీక్షలు వాయిదా పడ్డాయి.

English summary
As large scale violence continued to simmer in parts of the national capital, National Security Advisor Ajit Doval late on Tuesday night reached North East Delhi for an on the spot inspection and to get a stock of the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X