వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్పీటీపై చైనా మెలిక: ఎన్‌ఎస్జీలో సభ్యత్వంపై భారత్‌కు మళ్లీ మొండిచేయి

పొరుగు రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆందోళన ఉధ్రుతం కావడంతో అప్రమత్తమైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ముందుగానే మేలుకున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బెర్న్/ న్యూఢిల్లీ: అణు సరఫరా బృందం (ఎన్‌ఎస్జీ)లో సభ్యత్వం కల్పించాలన్న భారత్ అభ్యర్థనపై ఎటువంటి పురోగతి సాధించలేదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేయని దేశాలను ఎన్ఎస్జీలోకి అనుమతించే ప్రసక్తే లేదని చైనా మెలిక బెట్టింది. దీంతో మరోసారి నిర్ణయం వాయిదా పడింది.

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేయని దేశాలకు సభ్యత్వంపై వచ్చే నవంబర్‌లో చర్చించాలని ఎన్‌ఎస్జీ ప్లీనరీ సమావేశం నిర్ణయించింది. శుక్ర, శనివారాల్లో జరిగిన ప్లీనరీ సమావేశానికి ఎన్‌ఎస్జీలో స్విట్జర్లాండ్ రాయబారి బెన్నో లాగ్గెనర్ అధ్యక్షత వహించారు. ఎన్‌ఎస్జీలో భారత్ సభ్యత్వం పొందేందుకు పొరుగు దేశం చైనా అనుసరిస్తున్న కఠినవైఖరే ప్రధాన అవరోధంగా ఉన్నది. ఎన్పీటీలో సంతకం చేయనందున భారత్‌కు సభ్యత్వం కల్పించరాదని చైనా వాదిస్తున్నది.

NSG still unsure on India’s membership

దీంతో ఏకాభిప్రాయం ప్రాతిపదికన భారతదేశానికి ఎన్ఎస్జీలో సభ్యత్వం లభించడం సంక్లిష్టంగా మారింది. చైనా నిర్ణయంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే సంకేతాలు కనిపిస్తున్నాయి.

'ఎన్పీటీయేతర దేశాలకు ఎన్‌ఎస్జీలో సభ్యత్వం కల్పించడంలో సాంకేతిక, చట్టపరమైన, రాజకీయ పరమైన అంశాలపై చర్చించాం. చైర్మన్ చొరవ మేరకు దీనిపై వచ్చే నవంబర్‌లో చర్చించాలని నిర్ణయించాం' ఎన్ఎస్జీ తెలిపింది. 'భారత్‌కు పౌర అణ్వస్త్ర సహకారానికి 2008లో జారీచేసిన ప్రకటన అమలుకు అవసరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించాం' అని శనివారం 48 దేశాల గ్రూప్ 'ఎన్‌ఎస్జీ' ఒక ప్రకటనలో తెలిపింది.

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి కట్టుబడి ఉన్నామన్న స్విస్
ఈ సమావేశంలో పాల్గొన్న స్విస్ కాన్ఫిడరేషన్ అధ్యక్షురాలు డోరిస్ ల్యూథార్డ్ మాట్లాడుతూ అంతర్జాతీయ సుస్థిరత కోసం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇటీవల అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి విధించిన ఆంక్షల అమలుకు కట్టుబడి ఉన్నామని ఎన్‌ఎస్జీ స్పష్టం చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధకంపై ఆచరణ ప్రాతిపదికన ఎన్ఎస్జీలో సభ్యత్వానికి అనుమతించాలన్న భారత్ ప్రతిపాదనను చైనా తిప్పి కొట్టింది. చైనా తన మిత్రపక్షం పాకిస్థాన్‌కు కూడా సభ్యత్వం కల్పనపై ప్రధానంగా ద్రుష్టిని కేంద్రీకరించింది.

భారత్‌తో అనుబంధంపై చర్చించామన్న ఎన్ఎస్జీ
భారతదేశంతో తమ గ్రూపు అనుబంధం గురించి చర్చించామని ఎన్ఎస్జీ పేర్కొన్నది. ప్రత్యేకించి 2008లో భారతదేశానికి పౌర అణ్వస్త్ర సహకరిస్తామన్న తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఎన్ఎస్జీ అనుమతించిన తర్వాతే 2008లో అమెరికాతో పౌర అణు సహకార ఒప్పందంపై వీలు కలిగింది. కాగా అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానం అమలుకు కట్టుబడి ఉన్నామని ఎన్ఎస్జీ తెలిపింది.

English summary
The Nuclear Suppliers Group (NSG) plenary in Bern again ended inconclusively on the issue of India's membership with China refusing to budge from its position that the 48-nation Group, which controls international nuclear commerce, first establish criteria for inclusion of non-NPT signatories as members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X