వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నజీబ్ జంగ్ రాజీనామా వెనుక..!: కొత్త కోణాలు

న్యూఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్ నజీబ్‌ జంగ్‌ గురువారం అనూహ్య రీతిలో రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని కేంద్రానికి పంపించారు. ఇందుకు కారణాలను ఆయన వెల్లడించలేదు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్ నజీబ్‌ జంగ్‌ గురువారం అనూహ్య రీతిలో రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని కేంద్రానికి పంపించారు. ఇందుకు కారణాలను ఆయన వెల్లడించలేదు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రధాని మోడీకి, సీఎం కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇష్టమైన విద్యారంగంలోకి వెళ్తానని చెప్పారు.

18 నెలల ముందే నజీబ్ జంగ్ రాజీనామా: కేజ్రీతో వైరమే కారణమా18 నెలల ముందే నజీబ్ జంగ్ రాజీనామా: కేజ్రీతో వైరమే కారణమా

గత రెండేళ్లుగా కొనసాగిన అనుబంధానికిగాను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కూ, రాష్ట్రపతి పాలన సమయంలో తనకు మద్దతు ఇచ్చిన ఢిల్లీ ప్రజలకూ ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఐఏఎస్‌ అధికారైన జంగ్‌ 2013 జులై నుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆయన పదవీకాలం మరో పద్దెనిమిది నెలలు ఉంది. ఆయన రాజీనామా ఆశ్చర్యకరమని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ ప్రభావంతో జంగ్‌ పని చేశారని ఏఏపీ పేర్కొంది. తీపిచేదుల అనుభవం ఉన్నా ఏఏపీ ప్రభుత్వం, జంగ్‌ ఢిల్లీలో చక్కగా విధులు నిర్వర్తించినట్లు ఉప ముఖ్యమంత్రి సిసోడియా పేర్కొన్నారు. మరోవైపు, జంగ్ రాజీనామాను రాజకీయం చేయవద్దని బీజేపీ సూచించింది.

కొత్త కోణాలు

నజీబ్ జంగ్ రాజీనామాకు హోంమినిస్ట్రీ ఒత్తిడి తెచ్చిందా అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో అతను తదుపరి ఉప రాష్ట్రపతి రేసులో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని స్వయంగా నజీబ్ జంగ్ కొట్టి పారేశారు.

అయితే, జంగ్ రాజీనామా పూర్తిగా వ్యక్తిగతం అని, అతను తన కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలనుకుంటున్నారని చెబుతున్నారు.

మరో ఆసక్తికర విషయం ఏమంటే.. జంగ్ ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా చేశారు. కానీ అంతకుముందే తేదీ వేయని ఓ లేఖను కేంద్రానికి సమర్పిస్తూ.. తనకు 25 డిసెంబర్ 2016వ తేదీ నుంచి 1 జనవరి 2017వ తేదీ వరకు సెలవులు అడిగారు. సెలవులు అడిగిన అతను రాజీనామా చేయడం గమనార్హం.

సమాచారం మేరకు.. నజీబ్ జంగ్.. యూనియన్ హోం సెక్రటరీతో మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీ సమయంలోనే రాజీనామా అంశం చర్చకు వచ్చి ఉంటుందని చెబుతున్నారు.

మోడీని కలవనున్న శశికళ: సవాల్.. చిన్నమ్మకు ఆ పదవి సులభం కాదా?మోడీని కలవనున్న శశికళ: సవాల్.. చిన్నమ్మకు ఆ పదవి సులభం కాదా?

జంగ్ రాజీనామా విషయం తెలియదని, తాను మీడియాలోనే చూశానని, ఆయన రాజీనామాకు గురించిన సంకేతాలు ఏమీ లేవని యూనియరన్ హోం సెక్రటరీ చెప్పారు.

కాగా, డిసెంబర్ 25వ తారీకు నుంచి జనవరి 1వ తారీకు వరకు సెలవు కోరిన జంగ్.. ఆ లోపే రాజీనామా చేశారని అంటున్నారు.

సమాచారం మేరకు ఆ లేఖలో.. తాను డిసెంబర్ 25వ తేదీ నుంచి 'జనవరి 1వ తేదీ వరకు గోవా పర్యటనకు వెళ్లాలనుకుంటున్నానని, తాను ఆదివారం సాయంత్రం ఢిల్లీని వీడుతానని, తిరిగి ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వస్తానని లేఖలో పేర్కొన్నారని తెలుస్తోంది. ఢిల్లీ చీఫ్ సెక్రటరీతో తాను నిత్యం టచ్‌లో ఉంటానని, ముఖ్యమైనవి ఏమైనా ఉంటే మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్‌ను సంప్రదిస్తానన్నారు.

English summary
Several theories are doing the rounds as why Najeeb Jung, the former Lieutenant Governor of Delhi, resigned suddenly on Thursday, way ahead of the completion of his tenure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X