వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారిని క్షమించండి: తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ వారిపై కరుణ చూపిన నన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: తనపై సామూహిక అత్యాచారం చేసిన వారిని క్షమించాలని కోల్‌కత్తాలో అత్యాచారానికి గురైన నన్ కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని రాణా ఘాట్‌లోని ఓస్కూల్లో అర్ధరాత్రి ఆమెపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె, మనసులోని బాధను పక్కనబెట్టి పెద్ద మనసుతో వారిని క్షమించాలని తెలిపారు.

తన రక్షణకంటే, తన పాఠశాల, అందులో చదువుతున్న పిల్లల భద్రతే తనకు ముఖ్యమని తెలిపారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత కూడా ఆమె నిర్మలమైన మనస్సుతో కనిపిస్తోందని, ఇది ఆమె మనో ధైర్యానికి నిదర్శమని ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు వెల్లడించారు. చికిత్స్ పొందుతున్న నన్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Nun gangrape case: 10 detained, Centre seeks report from West Bengal govt

ఈ ఘటనపై విచారణ జరిపేందుకు రోమన్ కేథలిక్ ప్రతినిధి నదియా జిల్లాకు చేరుకున్నారు. గతంలో కూడా ఆ పాఠశాలకు చెందిన సిస్టర్లకు ఇంతకముందే బెదిరింపులు వచ్చాయని, దానిపై పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునందా ముఖర్జీ తెలిపారు.

ఇక నన్‌పై అత్యాచారానికి సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్‌గా ఉంది. నన్‌పై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వివరణ అడిగింది.

నదియా జిల్లాలోని గంగ్ నాపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఓ స్కూలుపై కొందరు దుండగులు దాడి చేసి, 71ఏళ్ల నన్‌పై సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. నిందితులను వెంటనే పట్టుకునేందుకు నదియా జిల్లా ఎస్పీ సమాచారం అందించిన వారికి రూ. లక్ష నజరానా కూడా ప్రకటించారు.

English summary
The Centre has asked the West Bengal government to send a report, and give details of action taken so far on the incident of gangrape of an elderly nun at a convent in Nadia district of Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X