వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా రోగులకు వైద్యం చేసే నర్సుల డ్రెస్ మారింది..!ఇక మీదట బికినీలోనే ట్రీట్ మెంట్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రపంచ దేశాల ప్రజలతో కరోనా మహమ్మారి చిత్రవిచిత్ర వేశాలేపిస్తోంది. ఆర్ధిక రంగాన్ని కుప్పకూల్చిన కరోనా తాజాగా వైద్యులతో, నర్సులతో వింత చేష్టలు చేపిస్తోంది. కరోనా వైరస్ ఏ రూపంలో ఉంటుందో, ఎక్కడ నుండి వ్యాపిస్తుందో తెలియక అనేక జాగ్రత్తలను తీసుకుంటున్నారు ప్రజలు. చిన్నా పెద్దా, ముసలి ముతక తేడా లేకుండా అందరూ కూడా మాస్కులు ధరిస్తూ తమ తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఐనప్పటికి కరోనా ఏదో ఒక రూపంతో పంజా విసురుతూనే ఉంది.

ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్‌పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు ప్రశ్నప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్‌పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న

ప్రాణాలకు తెగించి కరోనా వైద్యం అందిస్తున్న వైద్యులు.. నర్స్ ల డ్రెస్ పై చెలరేగుతున్న వివాదం..

ప్రాణాలకు తెగించి కరోనా వైద్యం అందిస్తున్న వైద్యులు.. నర్స్ ల డ్రెస్ పై చెలరేగుతున్న వివాదం..

కరోనా వైరస్ నిండి ప్రజలు కాపాడం ఎంత ముఖ్యమో, తమను తాము కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని వైద్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం చేస్తున్న కొంత మంది వైద్యులు కూడా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సందర్బాలు అనేకం ఉన్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో డాక్టర్లు, నర్సులు వినూత్న తరహాలో వైద్యం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నర్సులైతే చాలా వైవిద్యంగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది.

బంధువులకన్నా ఆప్యాయంగా చూసుకుంటున్న నర్సులు.. వ్యైద్యం అందించడంలో నర్సుల పాత్ర సూపర్..

బంధువులకన్నా ఆప్యాయంగా చూసుకుంటున్న నర్సులు.. వ్యైద్యం అందించడంలో నర్సుల పాత్ర సూపర్..

ప్రపంచాన్ని గడగడా వినికిస్తున్న కరోనా రాక్షస కోరల్లోంచి బయటపడేసేందుకు వైద్య సిబ్బంది విశేష కృషి చేస్తున్నారు. వైద్యులకు తోడు నర్సులు కూడా ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కుటుంబ సభ్యులు సైతం సేవలందించడానికి జంకుతున్న తరుణంలో నర్సులు కరోనా బాదితులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కానీ రష్యాకి చెందిన ఓ నర్సు చేసిన పనికి అందరూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ర‌ష్యాలోని టులా న‌గ‌రానికి చెందిన ఒక ఆస్పత్రిలో ఓ యువ‌తి న‌ర్సుగా సేవ‌లందిస్తోంది. క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు, న‌ర్సుల‌కు ఆస్పత్రి యాజమాన్యం పీపీఈ కిట్ల‌ను అందజేసింది. ఆ కిట్లతోనే వారు వైద్య సేవలు అందించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

పీపీఈ కిట్లతో అసౌకర్యం.. ఒకటే ఉక్కపోత అంటున్న నర్సులు..

పీపీఈ కిట్లతో అసౌకర్యం.. ఒకటే ఉక్కపోత అంటున్న నర్సులు..

అయితే, అందరూ తాము ధరించిన దుస్తుల పైనే పీపీఈ కిట్లను ధరించి వైద్యం అందిస్తున్నారు. కాని సదరు నర్సుకు మాత్రం తన దుస్తులపై నుంచి పీపీఈ కిట్ ధరించడం ఇబ్బందిగా పరిణమించింది. తట్టుకోలేని వేడి, ఉక్కపోతగా ఉందంటూ డ్రెస్సును పక్కన పడేసి కేవలం లోదుస్తులను మాత్రమే వేసుకుంది. వాటిపై పీపీఈ కిట్‌ను మాత్రమే ధరించింది. అలాగే, అదే గెటప్ లో కరోనా పేషెంట్లకి సేవలందిస్తుంది. అయితే, పీపీఈ కిట్ నుంచి తన శరీరం క్లియర్‌గా బయటకు కనిపిస్తున్నా ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు వార్డుకు తిరుగుతూ కరోనా రోగులకు సేవలు అందించి పలువురితో శభాష్ అనిపించుకుంటోంది.

Recommended Video

Trump To Bring Back Drug Making To US From India And China
సాహస నర్సు.. బీకినీలో వైద్య సేవలందిస్తున్న రష్యా నర్స్..

సాహస నర్సు.. బీకినీలో వైద్య సేవలందిస్తున్న రష్యా నర్స్..

ఆమె నిర్ణ‌యానికి ఆస్పత్రి యాజ‌మాన్యం సైతం అడ్డు చెప్పలేకపోయినట్టు తెలుస్తోంది. అయితే, న‌ర్సు వేష‌ధార‌ణ‌ నచ్చని ఓ క‌రోనా పేషెంట్, ఆమెను ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటో వైర‌ల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సు ఇంత అసభ్యంగా ప్రవర్తించడం దారుణమంటూ తిట్టి పోస్తున్నారు. ఈ విష‌యంపై స్పందించిన ఆ దేశ‌ వైద్య, ఆరోగ్య శాఖ సదరు నర్సుపై చ‌ర్య‌ల‌కు ఆదేశించింది. కాగా వైద్యులు మాత్రం సదరు నర్స్ చేసిన పనిని మెచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. బయటకు ఎలా కనిపిస్తున్నా కరోనా సోకకుండా ఉండడానికి అలాంటి డ్రెస్ విధానం అందరికి శ్రేయస్కరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
The nurse had difficulty wearing a PPE kit from her dress. The heat was unbearably hot, leaving the dresses aside and wearing PPE kit on only underwear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X