వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ దుస్తులు ఇలా.., ఒబామా టూర్: కుక్క పరుగు, అధికారుల హడల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ సంప్రదాయ బంద్‌గలా కుర్తాపైజామా ధరించి స్వాగతం పలికారు. గోధుమ రంగు నెహ్రూ కోటు మీద ఎర్రటి స్టోల్ వేసుకున్నారు. మధ్యాహ్నం ఒబామాతో చర్చలకు ఆయన సూట్లో హాజరయ్యారు.

రెడ్ కార్పెట్ పైన కుక్క, అధికారుల హంగామా

ఒబామా పర్యటన సందర్భంగా ఓ ఊరకుక్క అధికారులను హడలెత్తించింది. రాష్ట్రపతి భవన్‌లో రెడ్ కార్పెట్ పైన పరుగులు పెట్టింది. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఊరకుక్క ఎలా ప్రవేశించిందో తెలియక భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కుక్కను బందించి అక్కడి నుండి తరలించారు.

Obama visit: Stray dog breaches Rashtrapati Bhavan's security

కమ్యూనిస్టుల నిరసనలు

బరాక్‌ ఒబామా భారత్‌ పర్యటనను దేశంలోని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సామ్రాజ్యవాద శక్తుల ముందు భారత్‌ తలవంచరాదంటూ దేశంలోని పలు ప్రాంతాలలో ఒబామాకు వ్యతిరేకంగా వామపక్ష నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఒబామా రాకను నిరసిస్తూ సోషలిస్టు యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా కమ్యూనిస్టు సంస్థ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో భారీ ర్యాలీని నిర్వహించింది. అనంతరం ఒబామా దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఒబామాను భారతదేశానికి ఆహ్వానించడం సిగ్గుచేటంటూ ఆందోళనకారులు మండిపడ్డారు.

ప్రపంచ శాంతిని భగ్నం చేస్తున్న సామ్రాజ్యావాద దేశం అమెరికా అని ధ్వజమెత్తారు. మోడీ సర్కార్‌ సామ్రాజ్యావాదం ముందు మోకరిల్లుతోందన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఒబామా రాకకు వ్యతిరేకంగా నిరసనల పర్వం కొనసాగింది. రాష్ట్రంలోని ఆరు కమ్యూనిస్టు పార్టీలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

English summary
Obama visit: Stray dog breaches Rashtrapati Bhavan's security
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X