వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం, కేజ్రీవాల్ నిర్ణయం, ఇది మూడోసారి, కాలుష్యం తగ్గించేందుకే..

దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. నవంబర్‌ 13 నుంచి నవంబర్‌ 17 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. నవంబర్‌ 13 నుంచి నవంబర్‌ 17 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్ లా మారిన ఢిల్లీ.. స్కూళ్లకు నిరవధిక సెలవులు..ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్ లా మారిన ఢిల్లీ.. స్కూళ్లకు నిరవధిక సెలవులు..

గత మూడు రోజులుగా ఢిల్లీలో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి తోడు వాహనాలు విడుదల చేసే కాలుష్య కారకాలు గాలిలో కలవడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే స్థాయికి వాయుకాలుష్యం చేరుకుంది.

Odd-Even back in Delhi: The rules, exemptions and all other details

దీంతో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలో అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీలో సరి-బేసి సంఖ్యలున్న వాహనాల విధానాన్ని అమలు చేయడం ఇది మూడో సారి.

అంతకుముందు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాలుష్య స్థాయిలు కొంతమేర తగ్గాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకోవడంతో, ఢిల్లీ హైకోర్టు ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. దీంతో సీఎం కేజ్రీవాల్ మళ్లీ సరి-బేసి విధానానికి జండా ఊపారు.

ఇక చాలు.. ఆపండి: గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, ఢిల్లీలో నిలిచిన నిర్మాణాలుఇక చాలు.. ఆపండి: గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, ఢిల్లీలో నిలిచిన నిర్మాణాలు

అవసరమైతే గురువారం నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. సరి-బేసి విధానంతో ఢిల్లీలో వాహన ట్రాఫిక్‌ సగం మేర తగ్గుతోంది. డిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ ఉన్నప్పటికీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యాలు తక్కువగా ఉండటం ఈ విధానాన్ని అమలు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది.

అయితే కాలుష్య స్థాయిలు తగ్గించే లక్ష్యంతో కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కమర్షియల్‌ ట్రక్కులకు నగరంలోకి అనుమతించబోమని పేర్కొంది. నిర్మాణ కార్యకలాపాలు తక్షణమే ఆపివేయాలని తెలిపింది. ప్రజలు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్‌ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది.

English summary
With the national capital moving closer to a public health emergency due to rising air pollution, the Delhi government on Thursday announced the return of the Odd-Even scheme. The scheme, under which odd and even numbered vehicles ply on alternate days, would initially be in place for five days from November 13 to 17, i.e. Monday to Friday. This will be the third time when the Odd-Even rule will be enforced in the national capital. The scheme was first implemented for a fortnight from January 1, 2016 to January 15, and then for the second time from April 15 to 30, 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X