వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాశ్వతంగా కుదరదేమో: కేజ్రీ, సరి కంటే బేసీ నెం. బెస్ట్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సరి - బేసి విధానం శాశ్వతంగా ప్రవేశ పెట్టడం కుదిరే పని కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నాడు చెప్పారు. ఢిల్లీలో ఈ రోజు నుంచి సరి - బేసి విధానం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ... ఈ విధానాన్ని ఎప్పటికీ శాశ్వతంగా ఉంచడం సాధ్యమయ్యే పని కాదన్నారు.

జవవరి 15వ తేదీ వరకు దీనిని అమలు చేస్తామని చెప్పారు. పదిహేను రోజుల పాటు చూసిన తర్వాత దీనిని కొనసాగించాలా లేదా అనే విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఢిల్లీ వర్సిటీ విద్యార్థుల సైకిల్ ప్రయాణం

సరి - బేసి విధానాన్ని ప్రోత్సహించేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు సైకిళ్ల పైన నార్త్ క్యాంపస్‌కు వెళ్లారు. 'ఢిల్లీని కాపాడండి, భారత్‌ను కాపాడండి' అని నినాదాలు చేస్తూ వారు సైకిళ్ల పైన ప్రయాణించారు. చలికాలం నేపథ్యంలో జనవరి 4వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి.

Odd-even formula in Delhi: Here is how people reacted on this scheme

ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు సైకిళ్ల పైన తమ ఇంటి నుంచి క్యాంపస్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ కొత్త ఏడాదికి ఇది అద్భుతమైనదని చెప్పారు. ఈ కొత్త ఏడాదిన నేను సైకిల్ పైన వర్సిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని ఎస్ఆర్సీసీ విద్యార్థి కుషాన్ మెహ్తా చెప్పారు.

ఈ విధానం తొలుత ఇబ్బందిగా అనిపించినప్పటికీ మన వాతావరణాన్ని మనం రక్షించుకోవాలని, ఇందుకోసం ఇలాంటిది తప్పదని హిందూ కాలేజీ విద్యార్థి శ్రీజ గౌతమ్ అభిప్రాయపడ్డారు.

బేసి సంఖ్య నెంబర్ ఉంటేనే బెస్ట్!

ఢిల్లీలో సరి-బేసి కార్లను రోజు విడిచి రోజు తేదీల ప్రకారం రోడ్ల పైకి వదలాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి ఒకటి నుంచి ఇది అమలులోకి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది. బేసి సంఖ్య కార్ల నెంబర్లు ఉన్న వారికి ప్రయోజనం ఎక్కువ అని కొందరు పేర్కొంటున్నారు.

ఏదేని ఒక నెలలో 31 రోజులు వచ్చినప్పుడు 31వ తేదీన, ఆపై 1వ తేదీన వరుసగా రెండు రోజుల పాటు ఆ వాహనాలు రోడ్డు ఎక్కుతాయి. సరి సంఖ్య ఉన్న వాహనాలు 30వ తేదీ రహదారులపై తిరిగితే, ఆ తర్వాత మళ్లీ తదుపరి నెల 2వ తారీఖున అంటే మూడో రోజు వీధుల్లోకి వస్తుంది.

సరి బేసి విధానం శాశ్వతంగా అమలయ్యే పక్షంలో తమ వాహనాలకు బేసి సంఖ్య నంబర్ కావాలని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద వాహన కొనుగోలుదారులు వరుస కడతారంటున్నారు. జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో 31 రోజులు వస్తాయి. అంటే బేసి సంఖ్యగల కారు ఉంటే ఏడాదిలో అదనంగా 7 రోజుల పాటు తిరగొచ్చు. ఇక లీఫ్సంవత్సరం వస్తే ఫిబ్రవరిలో కూడా బేసి సంఖ్య వాహనాలకు లాభమే.

English summary
Delhi chief minister Arvind Kejriwal on Friday said it was not possible to implement the odd-even traffic rationing scheme on a permanent basis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X