వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరి-బేసిపై ఇలా: ఏం చేయను.. గీత దాటి చేతులెత్తేశాడు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సరి-బేసి విధానం ఈ రోజు విజయవంతంగా అమలు కావడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఈ విధానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించారన్నారు. రానున్న ఐదేళ్లలో ఢిల్లీ ప్రజలు దేశానికి మంచి మార్గం చూపుతారన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన సరి-బేసి ట్రాఫిక్ ఫార్ములాపై బిజెపి నేత, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందించారు. ఈ ట్రాఫిక్ ఫార్ములా మంచి ఫలితాలనివ్వనుందన్నారు. సరికొత్త ఫార్ములా అయినా జనం బాగా స్పందిస్తున్నారన్నారు. అయితే, ఈ అంశాన్ని రాజకీయం చేయడాన్ని మాత్రం ఆయన తప్పుబట్టారు.

కాగా, సరి - బేసి విధానం ప్రవేశ పెట్టిన తొలి రోజు అరగంట తర్వాత ఓ వ్యక్తి ఆ గీతను దాటాడు. దీనిని ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభిచారు. ఐటీవో జంక్షన్ వద్ద 33 నిమిషాల తర్వాత ఓ వ్యక్తి గీత దాటారు. అతనికి పోలీసులు రూ.2వేల జరిమానా విధించారు.

ఈ సందర్భంగా పోలీసులతో అతను మాట్లాడుతూ... తనకు మరో అవకాశం లేకపోవడం వల్లనే ఇలా జరిగిందన్నారు. పారీచౌక్‌లోని తన నివాసం నుంచి సరైన రవాణా సౌకర్యాలు లేవని చెప్పారు. తనకు నిబంధన తెలుసునని, కానీ మరో అవకాశం లేదన్నారు.

ఈ రోజు బేసీ సంఖ్యలు ఉన్న వాహనాలు మాత్రమే బయటకు రావాలి. కానీ ఉదయం గం.8.33 నిమిషాలకు ఐటీవో జంక్షన్ వద్ద సరి సంఖ్య ఉన్న కారులో అతను వచ్చాడు. దీంతో అతనికి పోలీసులు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ మాట్లాడుతూ... ప్రజలు తనకు సహకరించాలన్నారు.

సరి బేసి విధానం

సరి బేసి విధానం

ప్రభుత్వం సరి-బేసి విధానం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఢిల్లీ ఎన్విరన్‌మెంటల్ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఈ- రిక్షా ద్వారా సచివాలయానికి వెళ్తున్న దృశ్యం.

సరి బేసి విధానం

సరి బేసి విధానం

ప్రభుత్వం సరి-బేసి విధానం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా ద్విచక్ర వాహనంపైన సచివాలయానికి వెళ్తున్న దృశ్యం.

సరి బేసి విధానం

సరి బేసి విధానం

ప్రభుత్వం సరి-బేసి విధానం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో.. అరగంట తర్వాత సరి సంఖ్య నెంబర్ కారు కనిపించగా చలాన రాస్తున్న పోలీసులు.

సరి బేసి విధానం

సరి బేసి విధానం

ప్రభుత్వం సరి-బేసి విధానం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో అరగంట తర్వాత సరి సంఖ్య నెంబరు గల కారులో ప్రయాణించిన వ్యక్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి మరోసారి ఇలా రావొద్దని పోలీసులు చెబుతున్న దృశ్యం.

English summary
The first prosecution for violating Delhi government's odd-even scheme took place at ITO junction about 33 minutes after the restrictions became operational at 8 AM today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X