వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడవిని పునఃసృష్టించి; గంగమ్మను నేలకు దింపిన గిరిజన మహిళలు; ఇదో స్పూర్తిదాయకమైన కథ!!

|
Google Oneindia TeluguNews

చాలా సందర్భాలలో చదువుకున్న వాళ్ళ కంటే చదువు లేని వాళ్ళు ఎంతో బెస్ట్ అనిపిస్తారు. పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచన, వారిని అందరిముందు గొప్పగా నిలబెడుతుంది. అడవిని నమ్ముకుని బ్రతికే అడవి బిడ్డలు, అడవిని పునః సృష్టించి గంగమ్మను నేలకు దించి ఇప్పుడు దేశంలోనే చాలా గొప్పవాళ్ళుగా కనిపిస్తున్నారు. ప్రకృతి మాత విలువ తెలిసిన వాళ్ళు ప్రకృతిని కాపాడి, మన మనుగడ ప్రకృతి తోనే అని చెప్పే ప్రయత్నం చేశారు . ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి అడవినే సృష్టించిన ఘనత వహించారు ఒడిశా ఆదివాసీ మహిళలు. వారి 30 ఏళ్ళ కృషి గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

పర్వతంపై చెట్లను నరికిన గిరిజనులు.. దాహార్తితో విలవిలలాడటానికి అదే కారణం

పర్వతంపై చెట్లను నరికిన గిరిజనులు.. దాహార్తితో విలవిలలాడటానికి అదే కారణం


ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ఆంచల అనే అందమైన గిరిజన గ్రామం ఉంది. ఈ గిరిజన గ్రామంలోని గిరిజనులు ఊరి పక్కనే ఉన్న మాలి పర్వతంపైన ఉన్న చెట్లను తమ వంటచెరుకు కోసం, ఇతర అవసరాల కోసం నరికి వేశారు. దీంతో మాలీ పర్వతమంత బోసిపోయి వారి మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. అప్పటివరకు దాని పై నుండి అందంగా జాలువారే సెలయేటి ధార, వారి దాహార్తిని తీర్చి వారికి జీవనాధారంగా ఉండేది. ఎప్పుడైతే గుట్టపై ఉన్న అడవినంతా నరికి వేశారో, అప్పుడు ఆ జలధార కూడా రావడం ఆగిపోయింది. దీంతో అక్కడి గిరిజనులు విలవిలలాడారు. తాము సృష్టించిన సమస్యకు, ప్రకృతి చేసిన అపార నష్టానికి పర్యవసానంగా తీవ్ర పరిణామాలను చూశారు.

ప్రాణాధారమైన అడవిని పునః సృష్టించిన ఒడిశా మహిళలు

ప్రాణాధారమైన అడవిని పునః సృష్టించిన ఒడిశా మహిళలు


దీంతో ఆ గిరిజన గ్రామంలోని మహిళలు మళ్లీ తమ మనుగడ కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏ అడవిని అయితే వాళ్లు నరికారో, అదే అడవి ని వారు పున సృష్టించడానికి 30 ఏళ్ళ క్రింద తిరిగి మొక్కలు నాటి అకుంఠిత దీక్షతో శ్రమించారు. ఫలితంగా మళ్లీ గుట్ట పచ్చదనంతో కళకళలాడుతుంది. 30 ఏళ్ల సుదీర్ఘ శ్రమ తరువాత మాలీ పర్వతం పచ్చదనాన్ని సంతరించుకుంది. గుట్ట మీద రెండు వందల ఎకరాలలోనే కాకుండా, ఊరి చుట్టూ కూడా పచ్చదనాన్ని నింపేశారు. హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. తమకు ప్రాణప్రదమైన అడవికి పునః సృష్టి చేసి ఆ మహిళలంతా తమ నారీ శక్తి మరోమారు చాటుకున్నారు.

చెట్లు కొట్టకుండా కఠిన నిర్ణయం .. అడవికి కాపలా

చెట్లు కొట్టకుండా కఠిన నిర్ణయం .. అడవికి కాపలా

దీని కోసం వారు చేసిన శ్రమ అంతా ఇంతా కాదు. వంట చేయడానికి కట్టెలపై ఆధారపడటాన్ని తగ్గించిన గిరిజనులు, తాము చెట్లు కొట్టకుండా ఉండడం కోసం స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకున్నారు. చెట్లను నరికే వారికి ఐదు వందల రూపాయల జరిమానా విధించారు. ఒకవేళ చెట్లు నరికితే పంచాయితీ పెట్టి మరీ వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చే వారు. ఇక చెట్లు నరకడానికి దొంగతనంగా వెళ్లకుండా వారు సృష్టించిన అడవిని కాపాడడం కోసం మనుషులను కాపలా పెట్టారు. ఇక కాపుల పెట్టిన వారికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక, వారికి నెలకు పది కిలోల రాగులు ఇస్తూ వచ్చారు.

పచ్చగా పెరిగిన అడవి.. గంగమ్మ మళ్ళీ గిరిజనుల చెంతకు

పచ్చగా పెరిగిన అడవి.. గంగమ్మ మళ్ళీ గిరిజనుల చెంతకు

ఇక మహిళలు చేసిన ఈ ప్రయత్నంతో మళ్లీ అడవి ప్రకృతికి శోభ నిచ్చింది. అంతేకాదు ఆగిపోయిన అందమైన సెలయేటి జలధార కూడా మళ్లీ మీ కోసం అంటూ గిరిజనుల చెంతకు వచ్చింది. ఆంచల గిరిజన గ్రామ మహిళలు సంతోషంగా జీవించేలా, తాము సృష్టించిన అడవిని చూసుకుని సగర్వంగా తలెత్తుకుని తిరిగేలా ప్రకృతి మాత చేసింది. ఇక ఈ కథ తెలిసిన వాళ్లంతా ఇది కదా ప్రకృతిని కాపాడడానికి కావలసిన చైతన్యం అంటూ సదరు ఒడిశా గిరిజన గ్రామ మహిళలను కొనియాడుతున్నారు.

English summary
The women of Anchala village in Koraput, Odisha have shown their feminine power by recreating the forest they cut down. If you know the 30 years of hard work of the tribal women who brought back the forest and waterfalls to the ground, you will definitely salute them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X