వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిడెన్‌కు అప్పుడే అభిమానులు పుట్టుకొచ్చారు: బాటిల్‌లో మినియేచర్: ఎవరీ ఈశ్వర్ రావు: గిఫ్ట్‌గా

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షులకు భారత్‌లో అభిమానులు చాలామందే ఉన్నారు. ఇంకొన్ని గంటల్లో మాజీ కాబోతోన్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత్‌లో ఓ రేంజ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ట్రంప్ పేరు మీద ఇదివరకు యజ్ఞాలను నిర్వహించారు. గుడినీ కట్టారు విగ్రహాలను నెలకొల్పారు. ఇదే జాబితాలో జో బిడెన్ కూడా చేరారు. ఇంకొన్ని గంటల్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతోన్న బిడెన్‌కు అప్పుడే అభిమాన సంఘాలు పుట్టుకొచ్చేశాయి. ఆయన నిర్విఘ్నంగా పరిపాలన సాగించాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 ప్రాణాలు తీసిన పొగమంచు: వాహనం నుజ్జునుజ్జు: 13 మంది దుర్మరణం: రహదారి రక్తసిక్తం ప్రాణాలు తీసిన పొగమంచు: వాహనం నుజ్జునుజ్జు: 13 మంది దుర్మరణం: రహదారి రక్తసిక్తం

ఒడిశాకు చెందిన ఎల్ ఈశ్వర్ రావు అనే కళాకారుడు.. జో బిడెన్ మీద తనకు ఉన్న అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నారు. ఓ గ్లాస్ బాటిల్‌లో జో బిడెన్ మినియేచర్‌ను చిత్రీకరించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ మినియేచర్‌ను చిత్రీకరించినట్లు చెప్పారు. దాన్ని బిడెన్‌కు బహుమతిగా పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒడిశాలోని జాట్ని గ్రామానికి చెందిన ఈశ్వర్ రావు భువనేశ్వర్‌లో స్థిరపడ్డారు. మినియేచర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 25 సంవత్సరాలుగా ఆయన ఈ ఉంటున్నారు.

Odisha: Bhubaneswar Artist has crafted a miniature of US President-elect Joe Biden inside a glass bottle

ఇదివరకు ఫీఫా వరల్డ్ కప్, హాకీ వరల్డ్ కప్ ట్రోఫీ రెప్లికాలను ఆయన పెన్సిల్ నిబ్‌పై చిత్రీకరించారు. గుజరాత్‌లోని నర్మదా నదీతీరంలో నెలకొల్పిన అతి ఎత్తయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా బాటిల్‌లో రూపొందించారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని..

Odisha: Bhubaneswar Artist has crafted a miniature of US President-elect Joe Biden inside a glass bottle

స్త్రీ శక్తిని చాటే విగ్రహాన్ని ఆయన చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆయన జో బిడెన్ మినియేచర్‌ను బాటిల్‌లో రూపొందించారు. దీన్ని బహుమతిగా పంపిస్తానని ఈశ్వర్ రావు చెప్పారు. జో బిడెన్ పరిపాలన నిర్విఘ్నంగా సాగాలను తాను కోరుకుంటున్నానని చెప్పారు. అగ్రరాజ్యం అనే పేరుకు తగినట్లుగా బిడెన్ పాలన సాగిస్తారని అన్నారు.

English summary
Odisha: L Eswar Rao, a Bhubaneswar-based artist, has crafted a miniature of US President-elect Joe Biden inside a glass bottle. Joe Biden will take oath as the President of United States today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X