వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలిండియా స్కూల్ ర్యాంకింగ్స్ 2020: ఒడిషా ప్రభుత్వ పాఠశాలలకు 5వ ర్యాంకు

|
Google Oneindia TeluguNews

ఆలిండియా స్కూలు ర్యాంకింగ్స్‌ 2020లో ఒడిషాకు మంచి గుర్తింపు లభించింది. గంజాం జిల్లా హతియోటా మరియు బాలాన్‌గిర్ జిల్లాలోని పాతర్‌చేపలో ఉన్న ఒడిషా ఆదర్శ విద్యాలయ పాఠశాలకు దేశవ్యాప్తంగా 5వ ర్యాంకు లభించింది. గవర్నమెంట్ డే స్కూలు విభాగంలో గంజాం జిల్లాలోని హతియోటాలో ఉన్న ఒడిషా ఆదర్శ విద్యాలయ పాఠశాలకు 5వ ర్యాంకు దక్కగా ప్రభుత్వ బోర్డింగ్ స్కూలు కేటగిరీలో పాతర్‌చేపలోని ప్రభుత్వ పాఠశాలకు 5వ స్థానం దక్కింది.

ఒడిషా ఆదర్శ విద్యాలయ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మానస పుత్రిక ప్రాజెక్టు. పూర్తిగా ఇంగ్లీషు మీడియంలో ఉన్న ఈ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధిస్తారు. నాణ్యమైన బోధనతో పాటు విద్యను కూడా అందించాలన్న ఉద్దేశంతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ స్కూళ్లను ఏర్పాటు చేసింది. ఇక దేశవ్యాప్తంగా 5వ ర్యాంకు పొందిన ఈ స్కూళ్లను యాజమాన్యాన్ని, సిబ్బందిని సీఎం నవీన్ పట్నాయక్ అభినందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

Odisha CM Naveen Patnaiks Brain Child scheme OAV wins 5th rank in All India School rankings

" రెండు ప్రాంతాల్లోని ఒడిషా ఆదర్శ విద్యాలయ విద్యార్థులకు, బోధన సిబ్బందికి అధికారులకు నా అభినందనలు. ఆలిండియా స్కూల్ ర్యాంకింగ్స్‌లో ఈ విద్యాలయాలు 5వ ర్యాంకు పొందాయి. ఇక్కడ అందించే నాణ్యమైన విద్యతో ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకుని జాతీయస్థాయిలో రాష్ట్రానికి మంచి పేరును గుర్తింపును తీసుకొస్తారని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై EWISR సర్వే నిర్వహించింది. 11,368 మంది అభిప్రాయాలను ఈ సంస్థ సేకరించింది. ఇందులో స్కూలు ప్రిన్సిపాల్స్, టీచర్లు, విద్యావేత్తలు, సామాజిక ఆర్థిక విభాగంలో ఫీజులు చెల్లిస్తున్న తల్లిదండ్రులు, దేశవ్యాప్తంగా ఉన్న 28 ప్రధాన నగరాల్లోని సీనియర్ స్కూలు విద్యార్థులు, ఎడ్యుకేషన్ హబ్‌లు పాల్గొన్నారు. ఇక బాగా పాపులర్ అయిన 2వేల ప్రాథమిక మరియు సెంకడరీ స్కూళ్లకు రేటింగ్ ఇవ్వాల్సిందిగా సర్వే సంస్థ కోరింది. ఇందుకోసం విద్యా వ్యవస్థ మెరుగ్గా ఉందని చెప్పేందుకు 14 అంశాలను ఇచ్చింది. 14 అంశాలు ఇలా ఉన్నాయి.

అకాడెమిక్ రెప్యూటేషన్, బోధనా సిబ్బంది యొక్క సామర్థ్యం, విద్యార్థులపై వ్యక్తిగతంగా ఫోకస్ పెట్టడం, నాయకత్వం/ నాణ్యతతో కూడిన నిర్వహణ, కరిక్యులమ్, కో-కరిక్యులర్ ఎడ్యుకేషన్, రక్షణ మరియు పరిసరాల శుభ్రత, సామాజిక సేవ, అంతర్జాతీయ ప్రమాణాలు, తల్లిదండ్రుల ఆసక్తి, ఉపాధ్యాయ సంక్షేమం మరియు అభివృద్ధి, కట్టిన డబ్బులకు విలువ, క్రీడలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి 14 అంశాలున్నాయి.

Recommended Video

Inter-Caste Marriages : కులాంతర వివాహాలు చేసుకున్నవారికి రూ.2.5 లక్షల ప్రోత్సాహకం..!! || Oneindia

ఈ అన్ని అంశాలపై అభిప్రాయం సేకరించగా ఒడిషాలోని ఒడిషా ఆదర్శ విద్యాలయకు ఆలిండియా స్థాయిలో ఐదవ ర్యాంకు లభించింది.

English summary
Odisha CM Naveen Patnaik's brain Child Odisha Adarsha vidyalaya school in Ganjam district and Balangir district have won the 5th rank in All India School Rankings 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X