చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lockdown:25 మంది జాలర్లు, సముద్రంలో 1100 కి.మీ ప్రయాణం, తీరం చేరిన వెంటనే..

|
Google Oneindia TeluguNews

లాన్‌డౌన్ సమయంలో ఇంటినుంచి బయటకు వెళ్లొద్దని అధికారులు చెబుతోన్నా కొందరు వినిపించుకోవడం లేదు. సముద్రమార్గంలో కొందరు జాలర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. మొత్తం 39 మంది జాలర్లు బోటులో సముద్రంలో ప్రయాణించారు. అయితే లాక్ డౌన్ వల్ల తీరప్రాంతాల్లో పకడ్బందీగా గస్తీ ఉంది. దీంతో తమ స్వస్థలం చేరుకునేందుకు దాదాపు 1100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.

ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన 25 మంది జాలర్లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 మంది జాలర్లు కలిసి ఈ నెల 24వ తేదీన వేట కోసం సముద్రానికి వెళ్లారు. వీరంతా చెన్నై చేరుకొని.. అక్కడే బోటు అద్దెకు తీసుకొని వెళ్లారు. కానీ వేట సాధ్యం కాకపోవడంతో 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఇచ్చాపురంలో కొందరు మత్స్యకారులు దిగిపోయారు. పాటి సొనెపూర్‌లో మరికొందరు శనివారం దిగిపోయారు. మిగతావారు ఒడిశా గంజానికి సోమవారం వచ్చారు. వీరి గురించి తెలుసుకున్న అధికారులు.. వెంటనే వారి గురించి ఆరాతీశారు. వారికి ఆహారం అందజేశారు తర్వాత వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. గమ్యం చేరుకునేందుకు జార్లు ఉపయోగించిన బోటును కూడా సీజ్ చేశారు.

Odisha Fishermen, Stuck In Chennai, Travel 1,100 Km On Boat To Reach Home

ఏపీకి చెందిన 14 మంది జాలర్లు డాంకూరులో దిగిపోయారని అధికారులు తెలిపారు. అయితే మొత్తం 39 మంది జాలర్లను ఆయా ప్రాంతాల్లో క్వారంటైన్ చేసినట్టు పేర్కొన్నారు. జాలర్ల ఘటనతో ఒడిశా ప్రభుత్వం ఉలిక్కిపడింది. తీరప్రాంతాల్లో గస్తీని మరింత కఠినం చేయాలని ఆదేశించింది.

Recommended Video

Lockdown Lifting In AP || కరోనా వైరస్ వ్యాప్తిని ఎప్పటికీ కంట్రోల్ చెయ్యలేం : సీఎం జగన్

English summary
25 fishermen reached their native place in Odisha's Ganjam district on Monday after taking a sea voyage from Chennai where they were stuck due to the lockdown, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X