వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి లేఖతో యువతికి వివాహం: దిగొచ్చిన బ్యాంకర్

తన పెళ్ళికి సహాయం చేయాలని కోరుతూ ఓ యువతి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాసిన లేకకు వెంటనే స్పందించారు.దీంతో ఆ యువతికి వివాహం జరిపించేందుకు మార్గం సుగమమైంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

మల్కన్ గిరి: తన పెళ్ళికి సహాయం చేయాలని కోరుతూ ఓ యువతి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాసిన లేకకు వెంటనే స్పందించారు.దీంతో ఆ యువతికి వివాహం జరిపించేందుకు మార్గం సుగమమైంది.

ఒడిశాలోని భౌద్దు జిల్లాలో ఉచ్చోబహల్ గ్రామంలో నివసిస్తున్న సదానందనాయక్ రెవెన్యూ శాఖలో క్లాస్ 4 ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన గతంలో ఇంటి నిర్మాణం కోసం బ్యాంక్ నుండి 1.80 లక్షలను అప్పుగా తీసుకొన్నాడు.అయితే ఈ అప్పును ాయన తీర్చలేదు.

రెండు నెలల క్రితం సదానంద తన కుమార్తె పెళ్ళి చేయడం కోసం నిశ్చితార్థం చేశాడు. పెళ్లికోసం మళ్ళీ బ్యాంకులో లోన్ కోసం ధరఖాస్తు చేశాడు. అయితే తొలుత తీసుకొన్న అప్పునే తీర్చలేదు.కొత్తగా అప్పు ఇవ్వడం కుదరదని బ్యాంకు అధికారులు తేల్చేశారు.

Odisha girl thanks PM Modi after getting loan for marriage

దీంతో తన పెళ్ళి కోసం తండ్రి బాధను చూడలేక కూతురు ప్రియభతి నాయక్ ప్రధానమంత్రికి లేఖ రాశారు. తనకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఈ లేఖకు ప్రధానమంత్రి స్పందించారు.

భౌద్దు జిల్లా కలెక్టర్ మధుసూదన్ మిశ్రోకు ప్రధాని కార్యాలయం నుండి లేక వచ్చింది. బ్యాంక్ నుండి ప్రియభత్ కు సహయం చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ మధుసూధన్ వెంటనే బ్యాంకు వారిని పిలిచి లోన్ ప్రియభత్ కుటుంబానికి లోన్ ఇవ్వాలని ఆదేశించారు.

దీంతో బ్యాంక్ అధికారులు రూ.3.44 లక్షలను అప్పుగా ఇస్తామని ముందుకు వచ్చారు. ఈ లోన్ తో ఈ నెల 24వ, తేదిన ప్రియభత్ వివాహం జరగనుంది. అియతే తనకు ఇంత సహాయం చేసిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ తన పెళ్ళి పత్రికను పంపుతానని ప్రియభత్ చెప్పారు.

English summary
Priyabati Naik, 21, of Ucchabahali village in Boudh district was worried about the financial condition of her father. She became more worried after it became a hurdle in her marriage. Finding no solution, she wrote a letter to Prime Minister Narendra Modi and requested him to help her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X