• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమానుషం: పగిలిన మద్యం సీసాను భార్య జననాంగాల్లో గుచ్చి చిత్రహింసలు... వ్యభిచారానికి ఒప్పుకోవట్లేదని...

|

ఒడిశాలో అత్యంత దారుణ సంఘటన వెలుగుచూసింది. భార్య వ్యభిచారానికి ఒప్పుకోవట్లేదన్న కారణంతో ఓ భర్త అత్యంత క‌ౄరంగా ఆమెపై దాడి చేశాడు. పగిలిన మద్యం సీసాను భార్య జననాంగాల్లో గుచ్చి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.ఇనుప రాడ్డుతో ఆమెను చితకబాదాడు. భర్త వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతన్ని ఎదిరించే ధైర్యం లేక ఏడేళ్లుగా ఆ చిత్రవధను అనుభవిస్తున్నానని బాధితరాలు వాపోయింది. భువనేశ్వర్‌లోని చంద్రశేఖర్‌పురా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

ఒడిశాలోని పుల్బని ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఉద్యోగ అన్వేషణలో పదేళ్ల క్రితం భువనేశ్వర్ వచ్చింది. ఇదే క్రమంలో కేంద్రపరా జిల్లా పట్టముందై గ్రామానికి చెందిన చందన్ ఆచార్య అనే వ్యక్తితో భువనేశ్వర్‌లో ఆమెకు పరిచయం ఏర్పడింది. మూడేళ్ల ప్రేమ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలు వీరి కాపురం సాఫీగానే సాగింది. కానీ ఎక్స్‌ట్రా మనీ కోసం చందన్ ఆచార్య కట్టుకున్న భార్యనే వ్యభిచారిణిగా మార్చేందుకు సిద్దమవడంతో కాపురంలో కలహాలు మొదలయ్యాయి.

రెండేళ్లకే భర్త నుంచి ఊహించని షాక్....

రెండేళ్లకే భర్త నుంచి ఊహించని షాక్....

సంపాదన కోసం వ్యభిచారం చేయాల్సిందేనని భార్యపై చందన్ ఒత్తిడి తెచ్చాడు. పెళ్లయిన రెండేళ్లకు ఇలా భర్త నిజస్వరూపం బయటపడటంతో ఆమె షాక్ తిన్నది. తాను వ్యభిచారం చేయనని తెగేసి చెప్పింది. కానీ అతను మృగంలా ఆమెపై దాడి చేయడంతో నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. ఇంటినే వ్యభిచార కూపంగా మార్చిన అతను... గత ఏడేళ్లుగా ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. ఆమె ఎదురు తిరిగిన ప్రతీసారి చావబాది ఆమె నోరు మూయిస్తున్నాడు.

  Vizag Steel Plant:రూ.1300 కోట్లకే స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ? భారీ కుట్ర- ఉద్యమిద్దాం:Vijaya Sai Reddy
  పగిలిన సీసాను జననాంగాల్లో గుచ్చి చిత్రహింసలు...

  పగిలిన సీసాను జననాంగాల్లో గుచ్చి చిత్రహింసలు...

  ఇదే క్రమంలో ఐదు రోజుల క్రితం భార్యపై అతను మళ్లీ దాడి చేశాడు. విటులతో వ్యభిచారానికి ఆమె నిరాకరించడంతో పశువులా దాడికి తెగబడ్డాడు. ఇనుపరాడ్డుతో ఆమెను చితకబాదిన అతను... ఆపై పగిలిన మద్యం సీసాను ఆమె జననాంగాల్లో గుచ్చి చిత్రహింసలకు గురిచేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె విలవిల్లాడిపోయింది. ఇన్నాళ్లు భర్త పెడుతున్న టార్చర్‌ను మౌనంగా భరించిన ఆమె... ఎట్టకేలకు ధైర్యం చేసి మంగళవారం(మార్చి 23) పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా పోలీసులకు వివరించింది. చందన్ ఆచార్యను వదిలిపెట్టవద్దని అతన్ని కటకటాల్లోకి నెట్టాలని పోలీసులను వేడుకుంది. అతని చేతిలో తనలాంటి మరికొందరు అమాయక యువతులు కూడా చిత్రహింసలకు గురవుతున్నారని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతను నడిపిస్తున్న సెక్స్ రాకెట్ లింకులపై కూపీ లాగుతున్నారు.

  English summary
  In a spine-chilling incident, a man allegedly inserted a liquor bottle into the private parts of his wife following her refusal to indulge in prostitution at Chandrasekharpur area in the Capital city, on Tuesday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X