వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాయపడిన పాముతో మెడికల్ ఆసుపత్రికి...! చికిత్స కోసం ఓపి స్లిప్...! షాక్ తిన్న వైద్యులు

|
Google Oneindia TeluguNews

ఒడిశాలోని ఓ జంతు ప్రేమికుడు విచిత్రంగా వ్యవహరించాడు. గాయమైన పాముకు చికిత్స చేయించేందుకు ఏకంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన వ్యక్తి పాముకు పేరు పెట్టి ,దాని వయస్సు వివరాలు పెర్కన్న అనంతరం ఓపి చిట్టి తీసుకున్నాడు. దీంతో మనిషిలాగే ఓపి స్లిప్ తీసుకున్న సదరు వ్యక్తి చివరకు బ్యాగ్‌లోంచి తీయడంతో అశ్చర్యపోవడం అసుపత్రి వైద్యుల వంతైంది.

Odisha man takes injured snake to hospital, registers it as 7-year-old male,

ఒడిశాలో ఓ జంతు ప్రేమికుడైన మనోజ్ ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి. కాగా ఆయన గత పది సంవత్సరాలుగా పాములను రక్షిస్తున్నాడు. దీంతో మనోజ్‌కు గత శనివారం తమ ఇంట్లో పాము ఉందని ఫోన్ వచ్చింది. అయితే అక్కడికి వెళ్లిన మనోజ్ పాముకు విపరీతంగా గాయాలు కావడం గమనించాడు. దీంతో పాముకు చికిత్స చేయించేందుకు పశువైద్యశాలకు తీసుకువెళ్లాడు. అయితే అక్కడ అందుబాటులో వైద్యులు లేకపోవడంతో వెంటనే అందుబాటులో ఉన్న ఫకీర్ మోహన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అక్కడ పాములకు చికిత్స చేయరని తెలిసినా..పాముకు సప అని పేరు పెట్టి 7 సంవత్సరాల వయస్సుతో ఓపి స్లిప్ తీసుకున్నాడు.

ఇక ఓపీ స్లిప్ తీసుకున్న మనోజ్ డాక్టర్లు దగ్గరకు వెళ్లాడు. దీంతో ఓపి స్లిప్‌ను తీసుకుని పెషెంట్ కోసం అడిగిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. మనోజ్ నేరుగా సంచిలో నుండి పాము తీయడంతో ఖంగుతిన్నారు. దీంతో వైద్యులు పాముకు చికిత్స అందించేందుకు నిరాకరించారు. అయితే ఇదంతా తాను కావాలనే చేసినట్టు మనోజ్ వివరించాడు. పశువైద్య శాలలు సైతం 24 గంటలు తెరిచి ఉంచాలని కొరేందుకే పామును ఆసుపత్రికి తీసుకెళ్లానని వివరించాడు. ఇక పాముకు చికిత్స అందించిన మనోజ్ అనంతరం అడవిలో వదిలి వేశాడు.

English summary
Odisha man takes injured snake to hospital, registers it as 7-year-old male,paramedical staffs were presented with a scary surprise when Das took out the injured snake from his bag,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X