వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై ఘాతుకం - సెటిల్మెంట్ - కులం తక్కువని రివర్స్

|
Google Oneindia TeluguNews

తప్పుడు వ్యక్తుల బారి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన పోలీసే తోటి మహిళా ఉద్యోగిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. చట్టాలను పరిరక్షించే విధి నిర్వహిస్తూ తానే నేరానికి పాల్పడ్డాడు. సబ్ ఇన్స్‌పెక్టర్ అయిఉండి, మరో సబ్ ఇన్స్‌పెక్టర్‌పైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. తొలుత బలవంతంగా అనుభవించి, ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకున్న తర్వాత, తక్కువ కులానికి చెందినదానివంటూ ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. ఒడిశాలో సంచలనం రేపిన ఈ కేసు ప్రస్తుతం రాష్ట్ర డీఐజీ వద్దకు చేరింది. గంజాం జిల్లా పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి..

దారుణం:16 ఏళ్ల బాలికపై 30 మంది రేప్ - వికృత వీడియో వైరల్ - ప్రధాని తీవ్ర స్పందనదారుణం:16 ఏళ్ల బాలికపై 30 మంది రేప్ - వికృత వీడియో వైరల్ - ప్రధాని తీవ్ర స్పందన

ట్రైనింగ్ నుంచే కన్ను..

ట్రైనింగ్ నుంచే కన్ను..

ప్రస్తుతం కందమాల్ జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న మహిళా ఎస్సై తనపై జరిగిన అకృత్యంపై సోమవారం ఒడిషా డీఐజీ అభ్యాను కలిసి మరోసారి ఫిర్యాదు చేసింది. జంగాం జిల్లా ఖలీకోట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌పెక్టర్‌ సిలు ధాల్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సహోద్యోగి కదాని ఇంటికి రానిస్తే, సిలు దాన్నొక అవకాశంగా తీసుకుని, బలవంత పెట్టాడని, తీవ్రంగా ప్రతిఘటించినా అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ రాత్రాంతంతా ఏడుస్తూ కూర్చోగా.. పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాడని, తీరా వేరొక మహిళతో పెళ్లికి సిద్దపడ్డాడని బాధిత మహిళా ఎస్సై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్రైనింగ్ లో ఉన్నప్పటి నుంచే వేధింపుల పర్వం మొదలైందని ఆమె తెలిపారు.

ఫస్ట్ పోస్టింగ్‌లో ఒంటరిగా చిక్కడంతో..

ఫస్ట్ పోస్టింగ్‌లో ఒంటరిగా చిక్కడంతో..

బాధిత మహిళ, నిందితుడైన సిలు ధాల్ ఇద్దరూ 2017 బ్యాచ్ ఎస్సైలు. రాజధాని భువనేశ్వర్ లోని బిజూ పట్నాయక్ స్టేట్ పోలీస్ అకాడమీలో కలిసి ట్రైనింగ్ పొందారు. శిక్షణ మొదలైన తొలినాళ్లలోనే సిలు లవ్ ప్రపోజల్ చేయగా ఆమె నిరాకరించింది. అయినాసరే వదలకుండా ఫోన్లు, మెసేజ్ లతో విసిగించేవాడు. రోజురోజుకూ వేధింపులు పెరగడంతో అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కులం సమస్యను కూడా ప్రస్తావించింది. కొంతకాలం సైలెట్ గా ఉన్న సిలు.. ఫస్ట్ పోస్టింగ్ తర్వాత మళ్లీ ఆమె కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సంబల్ పూర్ జిల్లాలో ఫస్ట్ పోస్టింగా రాగా, అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉన్నానని, ఆ సమయంలో ఓ రాత్రి తన రూమ్ కు ఎస్సై సిలు ధాల్ వచ్చాడని, ఇష్టం లేదని గట్టిగా చెప్పినా వినకుండా బలవంతంగా రేప్ చేశాడని బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి...

కులం తక్కువని వేరే అమ్మాయితో..

కులం తక్కువని వేరే అమ్మాయితో..

అత్యాచార సంఘటనపై మహిళా ఎస్సై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంకాగా, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని సిలు నమ్మబలికాడు. కొంతకాలం ఆమె గదికి రాకపోకలు సాగిస్తూ మెల్లగా దూరమయ్యే ప్రయత్నం చేశాడు. ఈలోపే ఎస్సై సిలూకు మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందన్న విషయం తెలియడంతో బాధితురాలు నిలదీసింది. ముందు నుంచీ ఆమె భయపడ్డట్లే ‘‘నువ్వు తక్కువ కులం దానివి, మా వాళ్లు పెళ్లికి ఒప్పుకోరు''అని బుకాయింపునకు దిగాడు. దీంతో ఆమె కంధమాల్ జిల్లా సారంగద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఎస్సై సిలు తల్లిదండ్రులు సీన్ లోకి ఎంటర్ కావడంతో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది..

గుడిలో రహస్యంగా పెళ్లి..

గుడిలో రహస్యంగా పెళ్లి..

తోటి మహిళా ఎస్సైని అత్యాచారం చేశాడన్న సంగతి బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందన్న భయంతో ఎస్సై సిలు తల్లిదండ్రులు అతనికి నచ్చెప్పారు. సిలుపై పెట్టిన కేసులో స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటే, తమ కొడుకుతో పెళ్లి చేయిస్తామని వాళ్లు సెటిల్మెంట్ కు వచ్చారు. ఆ ఇద్దరినీ అప్పటికప్పుడే ఓ గుడికి తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి కూడా చేసేశారు. ఆ తర్వాత బాధిత మహిళ.. జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో తన ఫిర్యాదు స్టేట్మెంట్ ను మార్చుకుంది. ఇక ఆ కేసులో తాను శిక్ష నుంచి బయటపడ్డానని అర్థమైన తర్వాత ఎస్సై సిలు మళ్లీ పాత మనిషైపోయాడు, ‘‘నీ అంతట నువ్వే స్టేట్మెంట్ మార్చేశావు.. ఇక దిక్కున్న చోట చెప్పుకో.. నీలాంటి కులం తక్కువదానితో సంసారం చేయలేను..''అంటూ ప్లేటు ఫిరాయించాడు.

Recommended Video

హైదరబాద్ లో బాలికను రేప్ చేసిన రౌడీ షీటర్
పరారీలో కీచక ఎస్సై..

పరారీలో కీచక ఎస్సై..

తాజాగా దరింగ్‌బదీ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన బాధిత మహిళ.. ఎస్సై సిలు ధాల్ పై పలు సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కిందా కేసు పెట్టింది. తన జీవితంతో ఎస్సై సిలు ధాల్ ఎంత దారుణంగా ఆటాడుకున్నాడో వివరిస్తూ, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళా ఎస్సై సోమవారం ఒడిశా డీజీపీ అభ్యాస్ కు కూడా ఫిర్యాదు చేసింది. న్యాయం జరిగేలా చూస్తానని డీజీపీ హామీ ఇచ్చినట్లు ఆమె మీడియాకు తెలిపారు. ఒడిశా పోలీస్ శాఖలో సంచలనం రేపిన ఈ వ్యవహారంపై గంజాం జిల్లా ఎస్సీ బ్రిజేష్ కుమార్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడైన ఎస్సై సిల ధాల్ ప్రస్తుతం లాంగ్ లీవ్ లో ఉన్నాడని, కేసు నమోదు, డీజీపీకి ఫిర్యాదు తర్వాత అతను అజ్ఞాతంలోకి జారుకున్నాడని, ఆచూకీ దొరికిన వెంటనే అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారు.

English summary
A woman sub-inspector has accused a sub-inspector of the Khallikote police station in Odisha’s Ganjam district of raping her. The accused sub-inspector, identified as Silu Dhal, is presently absconding. The woman on Monday reached the office of Director General of Police (DGP) and lodged the complaint against Dhal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X