వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ కు సీఎం పదవి, బాంబు పేల్చిన మాజీ ప్రధాని దేవేగౌడ, పదవులు, కుమారస్వామి ఓకే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ దయతోనే తాను కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యానని హెచ్.డి. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ సందర్బంలకు కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి కుమారస్వామి సిద్దంగా ఉన్నారని మంగళవారం మాజీ ప్రధాని దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

మాఫీ చేయకుంటే రాజీనామా: కుమారస్వామి
జేడీఎస్ డిమాండ్

జేడీఎస్ డిమాండ్

ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవుల కోసం ఏ రోజు జేడీఎస్ డిమాండ్ చెయ్యలేదని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. ముఖ్యమంత్రి పదవి, కీలక మంత్రి పదవులు మాకు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చెయ్యలేదని మాజీ ప్రధాని దేవేగౌడ చెప్పారు.

కాంగ్రెస్ వేడుకుంది

కాంగ్రెస్ వేడుకుంది

మే 15వ తేదీ శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని మా దగ్గరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి వేడుకున్నారని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. అంతేకాని జేడీఎస్ మొదట కాంగ్రెస్ నాయకులను సంప్రదించలేదని హెచ్.డి. దేవేగౌడ అన్నారు.

కాంగ్రెస్ కు సీఎం స్థానం

కాంగ్రెస్ కు సీఎం స్థానం

తన దగ్గరకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమారస్వామిని సీఎం చేస్తామని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని తనతో అన్నారని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా సీఎం అయితే మద్దతు ఇస్తామని తాను చెప్పానని, అందులో దాచిపెట్టాల్సినది ఏమీ లేదని మాజీ ప్రధాని దేవేగౌడ స్పష్టం చేశారు.

ఎవరుకాంగ్రెస్ హైకమాండ్

ఎవరుకాంగ్రెస్ హైకమాండ్

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి హెచ్.డి. కుమారస్వామికి ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించిందని ఆ పార్టీ సీనియర్ నేత గులామ్ నబి ఆజాద్ తన దగ్గరకు స్వయంగా వచ్చి చెప్పారని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఇదే సందర్బంలో గుర్తు చేశారు.

మాజీ ప్రధాని మౌనం

మాజీ ప్రధాని మౌనం

ఒక్క వారంలో రైతుల రుణమాఫీ చెయ్యలేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని హెచ్.డి. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై మాజీ ప్రధాని దేవేగౌడ ఏ విధంగా స్పందించలేదు. మీడియా ఆ విషయంపై వివరణ కోరగా మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మౌనంగా ఉండిపోయారు.

English summary
A day after his son made the comment that he was indebted to the Congress and not the people, H D Deve Gowda said that the post of Chief Minister had first been offered by him to the Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X