వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీఎస్పీ అనుపమ కేసు, మరో ట్విస్ట్: ఎస్పీ వేధింపులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటకవ్యాప్తంగా చర్చనీయాంశమైన కూడ్లిగి డిఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామా అంశంలో మరో కొత్త ట్విస్ట్. సీనియర్ల వేధింపులు తాళలేకే తాను రాజీనామా చేశానని ఆమె మంగళవారం నాడు చెప్పారు. ఆమె కర్నాటక మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు.

డిఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామాలో కొత్త ట్విస్ట్

ఈ మేరకు కమిషన్‌కు ఏడు పేజీల లేఖ గతంలోనే రాశారు. జిల్లా ఎస్పీ చేతన్ తనను మానసికంగా వేధించారని ఆమె అందులో పేర్కొన్నారు. సరిగ్గా తాను రాజీనామా చేసిన జూన్ 4వ తేదీన ఆమె ఈ లేఖను పంపించారు. తన సమీప బంధువులతో ఈ లేఖను పంపించినట్లుగా తెలుస్తోంది.

anu

తన కింద పని చేసేవాళ్లు అసలు సహకరించేవారు కాదని, తన రాజీనామాకు కూడా ఎస్పీయే కారణమని ఆమె చెప్పారు. తాను పందొమ్మిది రోజుల సెలవులో వెళ్లినప్పుడు పోలీసు స్టేషన్లోని రహస్య డాక్యుమెంట్లను ఎస్పీ విడుదల చేశారని, వాటివల్ల తాను మానసిక వేదనకు గురయ్యానన్నారు.

సెలవు నుంచి తిరిగొచ్చిన తర్వాత చిన్న చిన్న కారణాలకే తన పైన పలు మెమోలు జారీ చేశారన్నారు. తాను సెలవు పెడితే ఆ లేఖను ఎస్పీ మెడికల్ బోర్డుకు పంపించారన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు బదులు మహిళా కమిషనే విచారణ జరపాలన్నారు.

English summary
Anupama Shenoy, former deputy superintendent of police in Ballari district, whose resignation attracted a lot of attention, has alleged mental harassment by senior officials in the police department, in a complaint to women’s commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X