వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారులో ఇటలీ మహిళపట్ల అసభ్యంగా అధికారి... అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Officer arrested on sex for Visa charge
బెంగళూరు: భారత్ నుండి ఇటలీకి తిరిగి వెళ్లేందుకు ఎగ్జిట్ వీసా కావాలంటూ వెళ్లిన తనను విదేశీయుల రిజస్ట్రేషన్ కార్యాలయంలోని అధికారు లైంగికంగా వేధించారని ఇటలీకి చెందిన ఇరవై ఏడేళ్ల మహిళ ఆరోపిస్తూ లే అవుట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అధికారి యాన్ కృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక సంస్థలో ఉద్యోగం చేసేందుకు 2011లో బెంగళూరుకు మూడేళ్ల కుమారుడితో కార్లోస్ వచ్చారు.

పోలీసుల కథనం ప్రకారం... ఒక సంస్థలో ఉద్యోగం చేసేందుకు 2011లో ఆమె బెంగళూరు నగరానికి వచ్చారు. ఆమె చేస్తున్న ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోవడంతో స్వదేశానికి వెళ్లేందుకు వీసా కావాలంటూ ఎఫ్ఆర్ఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బంది పని పూర్తి చేయకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు.

ఈ క్రమంలో ఓ ఉద్యోగి సలహా మేరకు ఆమె యాన్ కృష్ణన్‌ను కలిశారు. మీ ఇంటి వద్ద వదిలి పెడతానని చెప్పి తన కారులోకి ఎక్కించుకున్నాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కారు దిగి వెళ్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిని శనివారం అరెస్టు చేశారు.

English summary
A government officer in Bangalore was arrested on Saturday for allegedly molesting a 27 year old italian woman after promising to help her get an exit Visa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X