వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఇంట్లో ఎక్కడ చూసినా నగదు, నగలే, గోడలో బంగారం

కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున అధికారులు 131 కోట్లు, 170 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు.ఓ గోడలో దాచిన బంగారాన్ని కూడ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్ , మాజీ టిటిడి సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో ఎక్కడ చూసినా బంగారం, నగదు స్వాధీనం చేసుకొన్నారు.ఇంట్లో ఎక్కడ చూసినా నగదు, బంగారాన్ని దాచుకొన్నాడు శేఖర్ రెడ్డి, ఆయన ఇంటిని సోదా చేసిన అధికారులే విస్తుపోయారు.ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా నగదు దొరకడంతో అధికారులు షాక్ కు గురయ్యారు.

శేఖర్ రెడ్డి ఇంట్లో శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు అధికారులు సోదాలు చేసి ఆశ్చర్యపోయారు. ఆయన ఇంట్లో రహస్య ప్రదేశాలను ఏర్పాటు చేసుకొన్నాడు. ఈ రహస్యప్రదేశాల్లో నగదును, నగలను దాచుకొన్నాడు.శేఖర్ రెడ్డి సన్నిహితులు వ్యాపారవేత్తల ఇండ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

officers seize 131 crores currency, 170 kgs gold from shekar reddy house

శేఖర్ రెడ్డి ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇంట్లో సుమారు 131 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు. 170 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. సోదాలు నిర్వహిస్తుంటే ఆయన ఇంట్లో నగదు, బంగారం దొరకడంతో అధికారులు విస్తుపోయారు. ఆరు బ్యాగుల నిండా నగదును నింపారు.

గోడలో బంగారం

తాను సంపాదించిన నగదు, నగలను ఇంట్లోనే రహాస్య ప్రదేశాలను ఏర్పాటుచేసి దాచుకొన్నాడు శేఖర్ రెడ్డి.ఈ గోడ నిర్మాణంపై అధికారులకు అనుమానం వచ్చి దాన్ని తొలగించి చూస్తే ఆ గోడల లోపలి భాగంలో బంగారం కడ్డీలు దొరికాయి.కీలక దస్తావేజులను సైతం స్వాధీనం చేసుకొన్నారు.శేఖర్ రెడ్డి కి సంబంధించిన వ్యాపారవేత్తలు, బంధువుల ఇళ్ళల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

English summary
police, inicome tax officers search in shekhar reddy's house . they seized 131 crores rupees, 170 kgs gold, relativies, friends of shekar reddy houses officers searching, officers seized gold in the wall at the shekar reddy house
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X