వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాట్ ఛార్జీలు 5 శాతం తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్

పెట్రో ధరలను తగ్గించేందుకు ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం ద్వారా తమ వంతు ప్రయత్నం చేశామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ చెప్పారు. ఇక రాష్ట్రాలూ పెట్రోల్‌పై వ్యాట్‌ను 5 శాతం తగ్గిస్తే ప్రజలక

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రో ధరలను తగ్గించేందుకు ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం ద్వారా తమ వంతు ప్రయత్నం చేశామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ చెప్పారు. ఇక రాష్ట్రాలూ పెట్రోల్‌పై వ్యాట్‌ను 5 శాతం తగ్గిస్తే ప్రజలకు భారీ ఊరట కలుగుతుందని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.

. వినియోగదారుల ప్రయోజనాల కోసం కేంద్రం తరహాలో రాష్ట్రాలూ తమ బాధ్యతను నెరవేర్చాలని తాము విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు ధర్మేంధ్రప్రధాన్ .ఇంధనంపై వ్యాట్‌ను తొలగించేలా అన్ని రాష్ట్రాలను కోరుతూ ఆర్థిక మంత్రి లేఖలు రాస్తారని చెప్పారు.

Oil minister urges states to cut VAT on petrol, diesel by 5%

ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపుతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ 2.5, రూ 2.25 మేర తగ్గింది.. గత మూడు నెలలుగా పెరుగుతున్న పెట్రో ధరలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం మంగళవారం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ 2 తగ్గించింది.

పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర పన్నులు గణనీయంగా తగ్గితేనే వీటి ధరలు పూర్తిగా అదుపులోకి వస్తాయి.అయితే పెట్రోల్, డీజీల్ ధరలపై వ్యాట్ ట్యాక్స్‌ను తగ్గిస్తే రాష్ట్రాలు భారీగా ఆదాయాన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే కేంద్ర మంత్రి వినతిని రాష్ట్రాలు అమలు చేస్తాయా లేదా అనే చర్చ సర్వత్రా నెలకొంది.

English summary
Oil minister Dharmendra Pradhan on Wednesday said that petroleum ministry has urged the states to slash VAT (Value Added Tax) on petrol and diesel by 5 per cent, a day after the central government cut excise duty+ on fuel to protect retail consumers from high global crude oil prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X