• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓఖ్లా ప్రజలు అమిత్ షాకు కరెంట్ షాక్ ఇచ్చారు... ఆమ్ ఆద్మీ కౌంటర్..

|

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చీపురు పార్టీ స్వీప్ చేసేసింది. గతం కంటే కేవలం ఐదు సీట్లు మాత్రమే తగ్గాయి. 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించగా.. బీజేపీ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. బీజేపీ ఎంతమంది కేంద్రమంత్రులను,ముఖ్యమంత్రులను ఎన్నికల ప్రచారంలో మోహరించినా.. ఢిల్లీ ప్రజలు మాత్రం తాము కేజ్రీవాల్ వెంటే ఉన్నామని చాటి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ చేసిన విమర్శలకు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఇప్పుడు ధీటుగా బదులిస్తున్నారు.

అమిత్ షాకు కరెంట్ షాక్.. అమనతుల్లా ఖాన్ కామెంట్స్

అమిత్ షాకు కరెంట్ షాక్.. అమనతుల్లా ఖాన్ కామెంట్స్

షాహీన్‌బాగ్‌ లాంటి ఘటనలను ప్రతిఘటించేందుకు.. అంతే ఆగ్రహంతో ఈవీఎం బటన్ నొక్కాలని ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. తాజాగా ఢిల్లీలోని ఓఖ్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆప్ అభ్యర్థి అమనతుల్లా ఖాన్ అమిత్ షాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓఖ్లా ప్రజలు అమిత్ షాకు కరెంట్ షాక్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. కాగా,సీఏఏ నిరసనలు జరుగుతున్న షాహీన్‌బాగ్,జామియా వర్సిటీలు ఓఖ్లా నియోజకవర్గంలోనే ఉన్న సంగతి తెలిసిందే.

బెడిసికొట్టిన బీజేపీ ప్రచారం..

బెడిసికొట్టిన బీజేపీ ప్రచారం..

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను బీజేపీ నేతలు ఉగ్రవాది అని విమర్శించిన సంగతి తెలిసిందే. షాహీన్‌బాగ్,జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో సీఏఏకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై ఆ పార్టీ నేతలు నోరు పారేసుకున్నారు. వారికి బుల్లెట్లు దించండంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద నినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం బిర్యానీలు సమకూరుస్తోందని ఆరోపించారు. గతంలో రాళ్లు విసిరేవారు పాకిస్తాన్‌ నుంచి డబ్బు తీసుకుని కశ్మీర్‌లో ప్రజల ఆస్తులను ధ్వంసం చేసేవారన్నారు. కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌లు విధ్వంసకారులకు మద్దతిస్తూ వారికి బిర్యానీలు పంచితే తాము మాత్రం వారికి బుల్లెట్‌ రుచిచూపామని ధ్వజమెత్తారు.

విద్వేషపూరిత ప్రసంగాలు..

విద్వేషపూరిత ప్రసంగాలు..

అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కేజ్రీవాల్‌ను గెలిపిస్తే మరిన్ని షాహీన్‌బాగ్‌లు పుట్టుకొస్తాయని, నిరసనకారులు ఇళ్లల్లోకి చొరబడి అత్యాచారాలకు తెగబడుతారని బీజేపీ ప్రచారం చేసింది. దీనిపై 170 మంది మహిళా ప్రముఖులు,మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. రేప్‌ను ప్రచారాస్త్రంగా వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు, బీజేపీ నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ప్రధానికి లేఖ కూడా రాశారు.

 మూడోసారి సీఎం పీఠంపై కేజ్రీవాల్..

మూడోసారి సీఎం పీఠంపై కేజ్రీవాల్..


ఢిల్లీ ఎన్నికలను పాకిస్తాన్-భారత్ మధ్య యుద్దం అంటూ బీజేపీ ఎంత ప్రచారం చేసినా అక్కడి ప్రజలు దాన్ని ఒప్పుకోలేదు. కేజ్రీవాల్ తీసుకొచ్చిన సంక్షేమ,అభివృద్ది పథకాలను మెచ్చి తిరిగి ఆయనకే అధికారం కట్టబెట్టారు. దీంతో కేజ్రీవాల్ వరుసగా మూడోసారి సీఎం పీఠాన్ని చేజిక్కించుకున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ 28 సీట్లు గెలుచుకోగా.. ఆ తర్వాత 2015లో జరిగిన ఎన్నికల్లో 67 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించింది. తాజా ఎన్నికల్లో 63 స్థానాలు గెలుచుకుని తమ ప్రభుత్వానికి ప్రజల్లో ఇంకా ఆదరణ తగ్గలేదని నిరూపించుకుంది.

English summary
Aam Aadmi Party's Amanatullah Khan, leading by more than 70,000 votes over his closest rival, the BJP's Braham Singh, had a ready quip when asked about the results. the people of Okhla have given an electric shock, he said, referring to Amit Shah's recent advice to the people of Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X