వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడికి వెళ్ళాలంటే నగ్నంగానే, మహిళలకు ప్రవేశం నిషిద్దం

పురుషులకు మాత్రమే ప్రవేశానుమతి ఉన్న జపాన్‌లోని ఓ దీవికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. కొన్ని వందల ఏళ్ళుగా ఒకినోషిమా దీవిలోని షింటో పూజారి అక్కడి దేవతను ఆరాదించడం ఆచారంగా వస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

టోక్యో: పురుషులకు మాత్రమే ప్రవేశానుమతి ఉన్న జపాన్‌లోని ఓ దీవికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. కొన్ని వందల ఏళ్ళుగా ఒకినోషిమా దీవిలోని షింటో పూజారి అక్కడి దేవతను ఆరాదించడం ఆచారంగా వస్తోంది.

ఈ దీవిలోకి మహిళలకు అనుమతిలేదు. ఆ పవిత్ర ప్రాంతంలోని ప్రవేశించే పురుషులు అక్కడి ఆచారాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ముందుగా అక్కడి సముద్రంలో నగ్నంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

Okinoshima: Sacred Japanese island where women are banned becomes Unesco world heritage site

ఈ ఏడాది ఆ దీవిలో కేవలం రెండు గంటలపాటు జరిగే వేడుకకుగాను 200 మందిని మాత్రమే అక్కడి పూజారి అనుమతించారు. యునెస్కో గుర్తింపుతో ఈ దీవికి విపరీతమైన ప్రచారం దక్కనుంది.

ఈ నేపథ్యంలో ఇక్కడికి పర్యాటకులు పెద్దఎత్తున వెల్లువెత్తే అవకాశం ఉంది. దీంతో ఒకినోషిమా దీని ప్రత్యేకత. పవిత్రత దెబ్బతింటాయని అక్కడి పూజారులు భావిస్తున్నారు. ఈ కారణం చేతనే భవిష్యత్తులో ఇక్కడికి పర్యాటకులను అనుమతించబోమని కేవలం పూజారులనే రానిస్తారని చెబుతున్నారు.

అయితే ఆడవారికి అక్కడికి ప్రవేశం నిరాకరించడంపై అధికారులు కూడ తామేమీ చేయలేమని వ్యాఖ్యానించారు. మహిళలు సముద్రంలో ప్రయాణించి అక్కడికి చేరుకోవడం చాలా ప్రమాదకరమని భవిస్తారని, శతాబ్దాలనాటి ఆనవాయితీని దేవాలయాన్ని మార్చుకోబోదన్నారు.

ఇలాంటి నిషేధాన్ని మహిళలను రక్షించడానినే పెట్టి ఉంటారన్నారు. కొరియా ద్వీపకల్పాన్ని చైనాను కలిపేచోట ఈ దీవి ఉంటుంది. గతంలో ఇక్కడ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఎన్నో విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు లభించాయి.

అవి ఎటువంటి అవరోధాలు లేకుండా సముద్ర ప్రయాణం సాగినందున ఇక్కడి దేవతను ఆరాధించిన వ్యాపారులు సమర్పించినవి అయి ఉంటాయని ఆలయపూజారి మునకత తైషా తెలిపారు. కాగా, ఇటీవల పోలండ్‌లో సమావేశమైన యునెస్కో హెరిటేజ్ కమిటీ ఆదివారం తాజగా ప్రకటించిన 33 ప్రదేశాల్లో ఒకినోషిమా ఒకటి.

దీంతోపాటుగా భారత్‌లోని అహ్మదాబాద్ నగరంతోపాటు మానవుడు మొదటిసారిగా స్థిరనివాసం ఏర్పరచుకొన్నట్టు గుర్తించిన దక్షిణ ఫసిఫిక్ దీవుల్లోని టవుటపువాటీ అనే పొలినేషియన్ ట్రయాంగిల్ కూడ ఉంది.

అలాగే యూకేలో లేక్ డిస్ట్రిక్ట్ ఆఫ్రికా నుండి నల్లజాతీయులను బానిసలుగా తీసుకొచ్చిన బ్రెజిల్‌లోని రియోడిజనీరోలోని వలొంగోవార్ప్ అనేవి కూడ ఉన్నాయి.

English summary
A sacred Japanese island where women are banned and men must strip naked has achieved Unesco world heritage status. Okinoshima is home to the 17th century shrine of Okitsu, which was once used to pray for maritime safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X