వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ పాత నోట్లకు డిమాండ్: రూ. 500కు 550, 1000కి 1100

అక్కడ పాత నోట్లకు డిమాండ్: రూ. 500కు 550, 1000కి 1100

|
Google Oneindia TeluguNews

కోల్‌క‌తా: పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీ మొత్తంలో ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకునేందుకు నల్లకుబేరులు ఆందోళన చెందుతుంటే.. సామాన్యులు చెలామణిలో ఉన్న నగదు దొరక్క, తమ వద్ద ఉన్న కొద్దో గొప్పో పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మాత్రం పాత నోట్లకు భలే డిమాండ్ ఉంది.

కోల్‌కతా ట్రేడింగ్ హ‌బ్‌ బుర్రాబ‌జార్‌లో పాత నోట్ల‌ను అదనంగా చెల్లింపులు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. పాత రూ.500 నోటుకు 550, 1000నోటుకు రూ.1100ల ఇస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇక్క‌డి వ్యాపారస్తులు కోట్ల కొత్త నోట్లు పెట్టుకొని పాత నోట్ల కోసం ఎదురుచూస్తున్నారు. నెల రోజుల కింద‌టే వీళ్లే పాత వెయ్యి నోటు తీసుకొని రూ.800 నుంచి రూ.850 ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా ఎక్కువే ఇస్తున్నారు. అయితే, ఇందుకు కారణం కూడా ఉంది.

షెల్ కంపెనీలు త‌మ బ్యాలెన్స్ షీట్ల‌లో క్యాష్ ఇన్ హ్యాండ్ కాల‌మ్‌ను భారీగా చూపించ‌డంలో భాగంగానే ఈ కంపెనీలు ఈ ప‌నికి పూనుకున్నాయి. న‌గ‌దు లావాదేవీలు అధికంగా జ‌రిగాయ‌ని చెప్ప‌డానికే ఈ చర్యకు రంగంలోకి దిగారు. డిసెంబ‌ర్ 31న ముగిసే మూడో త్రైమాసికంలోపు త‌మ న‌గ‌దు లావాదేవీల‌ను స‌మ‌ర్థించుకునేందుకే ఆ కంపెనీలు ఇలా చేస్తున్నాయ‌ని కోల్‌క‌తాలోని అకౌంటింగ్ అధికారులు విశ్లేషిస్తున్నారు.

 Old notes selling at a premium in Kolkata market

న‌వంబ‌ర్ 8న మోడీ నోట్ల రద్దు నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌గానే.. ఈ కంపెనీలు చాలావ‌ర‌కు త‌మ ద‌గ్గ‌ర ఉన్న న‌గ‌దును మార్పిడి చేసుకోవ‌డ‌మో.. బ్యాంకుల్లో డిపాజిట్లు చేయ‌డ‌మో చేశారు. అయితే మూడో త్రైమాసికం ముగింపుకు వ‌స్తున్న స‌మ‌యంలో కంపెనీల ద‌గ్గ‌ర క్యాష్ ఇన్ హ్యాండ్ అని చూపించుకునేందుకు చాలా త‌క్కువ మొత్తం న‌గ‌దే ఉంది.

అయితే గ‌తంలో ఈ కంపెనీలే త‌మ బ్యాలెన్స్ షీట్ల‌లో చాలా ఎక్కువ మొత్తంలో న‌గ‌దు లావాదేవీలు జ‌రిగిన‌ట్లు చూపించిన‌ట్లు ఇన్‌క‌మ్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. చాలాకాలంగా ఈ కంపెనీలు భారీ మొత్తంలో క్యాష్ ఇన్ హ్యాండ్ చూపించాయంటే అవి చాలా వ‌ర‌కు పాత రూ.500, వెయ్యి నోట్ల‌లోనే ఉండి ఉండాలి. కానీ ఈ నోట్ల‌ను డిసెంబ‌ర్ 30లోపే మార్చుకునే వీలుంది. దీంతో గ‌తంలో చూపించిన న‌గ‌దు లావాదేవీల‌ను స‌మ‌ర్థించుకునేందుకు ఈ కంపెనీలకు పాత నోట్లు అవసరమయ్యాయి. దీంతో ఎక్కువ మొత్తం చెల్లించైనా పాత నోట్లను సేకరించే పనిలో పడ్డాయి.

English summary
At a time when people across the country are queuing up outside banks to get rid of old Rs 500 and Rs 1000 notes, the scrapped currencies are selling at a premium in the serpentine bylanes of trading hub Burrabazar. Old notes of Rs 500 and Rs 1000 will fetch you Rs 550 and Rs 1,100 here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X