• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

RBI సంచలనం: మళ్లీ నోట్లరద్దు -పాత రూ.100 ఇక చెల్లదు -రూ.10, రూ.5నోట్లు కూడా -నాణేలపైనా

|

ఏడేళ్ల నరేంద్ర మోదీ పాలనలో దేశప్రజలు ఎన్నెన్నో అనూహ్య అనుభవాలు ఎదుర్కొన్నారు. వాటిలో డీమానిటైజేషన్(పెద్ద నోట్ల రద్దు) ప్రతిఒక్కరినీ తీవ్రంగా ప్రభావితం చేసింది. కాగా, దేశంలో మరోసారి నోట్ల రద్దుకు తెరలేవనుంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. రెండో దశ నోట్ల రద్దు ప్రతిపాదిత సమయాన్ని కూడా ఆయన తెలిపారు..

  #Old100RupeesNote పాత రూ.100 నోట్లు మాయంకానున్నాయా? ఆర్బీఐ ఏమంటుంది.?

  నిమ్మగడ్డకు అవమానం -ఆఫీసులో ఉన్నా, పీఎస్‌కు లేఖ -ప్రతీకారంగా ఎస్ఈసీ సంచలన ఆదేశాలునిమ్మగడ్డకు అవమానం -ఆఫీసులో ఉన్నా, పీఎస్‌కు లేఖ -ప్రతీకారంగా ఎస్ఈసీ సంచలన ఆదేశాలు

   పాత నోట్లన్నీ రద్దు..

  పాత నోట్లన్నీ రద్దు..

  ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను మార్చి లేదా ఏప్రిల్ లోగా ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ జనరల్ మేనజర్ బీ. మహేశ్ తెలిపారు. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జిల్లా స్థాయి సెక్యూరిటీ కమిటీ (DLSC), జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్‌మెంట్ కమిటీ (DLMC)) సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని తెలిపారు. పాత సిరీస్‌లో ఉన్న నోట్లను మార్చి నాటికి చెలామణిలో లేకుండా చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుందని, అందుకే గడిచిన ఆరు సంవత్సరాలుగా ఈ నోట్లను ఆర్బీఐ ముద్రించడం లేదని చెప్పారు. కాగా..

  ఈసారి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా..

  ఈసారి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా..

  2016నాటి తొలిదశ డీమానిటైజేషన్ సమయంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడిన నేపథ్యంలో.. రెండో దశ నోట్ల రద్దుపై ఆర్బీఐ జాగ్రత్తలు వహించనుంది. పాత కరెన్సీ నోట్ల రద్దు విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతానికి పాత నోట్లు అంతటా చెల్లుబాటు అవుతాయని, బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే పాత నోట్లను మాత్రం ఆర్బీఐ సేకరిస్తుందని, తిరిగి వాటిని మార్కెట్‌లోకి వదలబోదని, అలా పూర్తి స్థాయిలో మార్చి లేదా ఏప్రిల్ నాటికి పాత నోట్ల సేకరణ ప్రక్రియను పూర్తవుతుందని ఆర్బీఐ అధికారి చెప్పారు. పాత నోట్లన్నీ ఆర్బీఐకి వెళ్లిపోయాక.. కేవలం కొత్త నోట్లు మాత్రమే మిగులుతాయని గుర్తుచేశారు. ఇక..

   రూ.10 నాణేల చెల్లుబాటుకు ప్రయత్నం..

  రూ.10 నాణేల చెల్లుబాటుకు ప్రయత్నం..

  రూ.10 నాణేలను మార్కెట్లో ప్రవేశపెట్టి 15 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వీటిపై పుకార్లు వస్తున్నాయని ఆర్బీఐ అధికారి మహేశ్ అన్నారు. వ్యాపారులు, సాధారణ ప్రజలు ఎవరూ వీటిని తీసుకోవడం లేదని.. చెస్ట్ బ్యాంకుల్లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయని వెల్లడించారు. పది రూపాయల నాణులు చెలామణి అయ్యేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు సూచించారు. వీటిప ప్రజలతో పాటు వ్యాపారులకూ అవగాహన కల్పించాలని చెప్పారు. రూ.10 నాణేలను మార్కెట్‌లోకి పంప్ చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు.

  తిరుపతి ఉపఎన్నిక: పవన్ రామబాణం -రూ.30లక్షల విరాళం -రాక్షసుడుణ్ని పండితుడంటూ అనూహ్యంతిరుపతి ఉపఎన్నిక: పవన్ రామబాణం -రూ.30లక్షల విరాళం -రాక్షసుడుణ్ని పండితుడంటూ అనూహ్యం

  English summary
  The Reserve Bank of India (RBI) is planning to withdraw the old series of currency notes including Rs 100, Rs 10, and Rs 5 by March or April, an assistant general manager of the B Mahesh said on Friday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X