వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నోట్ల రద్దు'తో మరొకరు బలి: ఏటీఎం 'క్యూ'లో తీవ్ర అస్వస్థతతో గుండెపోటు

ట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 70మందికి పైగా చనిపోయారన్న ఆరోపణలుండగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో వృద్దురాలు ప్రాణాలు విడిచింది.

|
Google Oneindia TeluguNews

త్తరప్రదేశ్ : నోట్ల రద్దు కారణంగా.. యావత్తు భారతం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లెన్లలో నిలబడి కష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కనీస అవసరాలకు కూడా డబ్బు చేతిలో లేకపోవడంతో.. ఎన్ని గంటలైనా బ్యాంకుల ఎదుట వేచియుండడానికి జనం వెనుకాడడం లేదు. అయితే గంటల తరబడి వేచి చూసినా.. డబ్బు చేతికందని పక్షంలో వారి అసహనం ఘర్షణలకు దారితీసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Old Woman dies in atm queue in Uttarpradesh

ఇక వృద్దుల పరిస్థితి మరింత దయనీయం. నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 70మందికి పైగా చనిపోయారన్న ఆరోపణలుండగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో వృద్దురాలు ప్రాణాలు విడిచింది. యూపీలోని బల్లియా సెంట్రల్ బ్యాంక్ ఏటీఎం వద్ద ఇంద్రసాని దేవి (70) అనే వృద్ధురాలు గురువారం నాడు చాలాసేపు ఏటీఎం ముందు లైన్ లో నిలబడింది.

దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె గుండెపోటుతో మరణించింది. విషయాన్ని వ్రుద్దురాలి కుటుంబ సభ్యులు వెల్లడించారు. మరింత బాధించే అంశమేంటంటే.. ప్రస్తుతం వృద్ధురాలి అంత్యక్రియలకు కూడా ఆ కుటుంబం వద్ద డబ్బు లేదు. దీంతో చేసేదేమి లేక.. ఏ ఎటీఎం వద్దనైతే వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిందో.. అదే ఏటీఎం వద్ద వృద్ధురాలి అంత్యక్రియల నగదు కోసం క్యూ లెన్ లో నిలబడ్డారు కుటుం సభ్యులు. దీనిపై స్పందించిన స్థానిక వైభవ్ కృష్ణ.. ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు.

English summary
In a bid to weed out black money from the country, the demonetisation move by the central government a few days ago has already led to 70 deaths across the nation. The latest casualty is a old woman passed away
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X