వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓం బిర్లా కుమార్తెపై సంచలన ఆరోపణలు.. బ్యాక్ డోర్‌లో సివిల్స్‌కి ఎంపిక..? అసలు వాస్తవం ఇదీ...

|
Google Oneindia TeluguNews

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా బ్యాక్ డోర్‌ ద్వారా సివిల్స్‌కు ఎంపికైందని ఆరోపిస్తూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్‌గా మారాయి. అసలు యూపీఎస్సీ పరీక్ష కూడా రాయకుండానే ఆమె సివిల్స్‌కి ఎంపికైందని ఆ పోస్టుల్లో ఆరోపించారు. కేవలం తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని ఆమె అడ్డదారిలో ఐఏఎస్ సాధించారని ఆరోపించారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ సంస్థ తేల్చింది.

బ్యాక్ డోర్ ఎంట్రీలో 90 సీట్లు?

బ్యాక్ డోర్ ఎంట్రీలో 90 సీట్లు?

అంజలి బిర్లాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ సంస్థ ఒక పోస్టును షేర్ చేసింది. 'ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించారు. నిజానికి ఆమె అసలు పరీక్ష కూడా రాయలేదు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే యూపీఎస్సీలో 90 సీట్లను బ్యాక్ డోర్ ఎంట్రీ కోసం రిజర్వ్ చేశారు.కేవలం రాజకీయ పలుకుబడి కారణంగా కష్టపడి చదివే అభ్యర్థులకు బదులు ఇలాంటివాళ్లకు సివిల్స్‌లో స్థానం దక్కుతోంది.'అని ఆ పోస్టులో ఆరోపించారు.

Recommended Video

IAS Officer Submits Fake OBC Certificate | చిక్కుల్లో Kerala IAS || Oneindia Telugu
అంజలి బిర్లా సివిల్స్ పరీక్ష రాశారా?

అంజలి బిర్లా సివిల్స్ పరీక్ష రాశారా?

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఫ్యాక్ట్ చెక్ తేల్చింది. అంజలి బిర్లా 2019లో యూపీఎస్సీ ప్రిలిమ్స్‌తో పాటు,మెయిన్స్ కూడా రాసి అర్హత సాధించిందని పేర్కొంది. దీనికి సంబంధించి యూపీఎస్సీ ప్రచురించిన ర్యాంకుల జాబితాను కూడా షేర్ చేసింది. ఆమె హాల్ టికెట్ నం.0851876 అందులో స్పష్టంగా కనిపిస్తోంది. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అంజలి బిర్లా కూడా ఖండించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొన్నారు. పుకార్లు ఎప్పుడూ వినేందుకు బాగుంటాయని... కానీ ఇలాంటి అర్థం లేని,ఆధారాలు లేని విమర్శలను తానెప్పుడూ చూడలేదని అన్నారు.

సివిల్స్... ఎంతోమంది కల...

సివిల్స్... ఎంతోమంది కల...

దేశంలో అత్యున్నత సర్వీసుల్లో చేరేందుకు యూపీఎస్సీ ఒక ప్రవేశ ద్వారం లాంటిది.ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అభ్యర్థులు యూపీఎస్సీకి పోటీపడుతారన్న సంగతి తెలిసిందే. వీరిలో కేవలం కొన్ని వందల మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. ప్రిలిమ్స్,మెయిన్స్,ఇంటర్వ్యూ... ఇలా మూడంచెల ప్రక్రియ ద్వారా యూపీఎస్సీకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. చిన్న వయసులోనే అధికార హోదా,సమాజం కోసం పనిచేసే అవకాశం ఉండటంతో చాలామంది విద్యావంతులు సివిల్స్‌ను తమ మొదటి లక్ష్యంగా పెట్టుకుంటారు.

English summary
The post’s Hindi caption translates to English as: “Om Birla’s daughter cleared IAS in the first attempt. She didn’t undertake any exam. 90 seats kept for back door entry (reserve list) for the country's most prestigious examination are being used for officials with power instead of poor, hard-working, people from a rural background and deserving candidates.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X