వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో గేమ్స్,సినిమాలు, పుస్తకాలతో కాలం గడుపుతున్న మహబుబా ముఫ్తి, ఒమర్ అబ్ధుల్లా..!

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో కీలక పార్టీ నేతలుగా ఉన్న మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మహబుబా ముఫ్తిలు ఎం చేస్తున్నారో తెలుసా,..? జమ్ము కశ్మీర్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నడుమ వారిని నిర్భంధంలో ఉంచడంతో ఒమర్ అబ్ధుల్లా వీడియో గేమ్స్,సినిమాలు చూస్తుండగా, మహబుబా ముఫ్తి మాత్రం ప్రార్థనలు, పుస్తకాలతో కాలం గడుపుతున్నారు. పన్నేండు రోజులుగా ప్రత్యేక ప్రదేశంలో నిర్భంధంలో ఉన్న నేతలు ఇలాంటీ ప్రత్యేక హబిట్స్ కాలం వెల్లదీస్తున్నారు.

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ రద్దుతోపాటు రాష్ట్రాన్ని విభజించడంతో కశ్మీర్‌లో ప్రత్యేక పరిస్థితులు నెలకోన్నాయి. పూర్తిగా రాష్ట్రం బద్రతా దళాల నిర్భంధంలోకి వెళ్లడంతో కర్ఫ్యూ విధించారు. దీనికి తోడు కనీసం కమ్యూనికేషన్ వ్యవస్థను కూడ కట్ చేశారు. దీంతో పాటు రాష్ట్ర నాయకులను కూడ నిర్భంధంలో ఉంచారు. దీంతో అక్కడి నేతలకు పని లేకుండా పోయింది. ఎం చేయాలన్న కనీసం బయటికి వెళ్లలేని పరిస్థితి, కనీసం ఫోన్ల్ విషయాలు షేర్ చేసుకుందామనుకున్న కమ్యూనికేషన్ వ్యవస్థ కట్ అయింది.

Omar Abdullah and Mehbooba Mufti have been busy with video games and books

దీంతో కశ్మీర్‌లో కీలక నేతలుగా భావించే రెండు పార్టీల నాయకులు తమ వ్యక్తిగత అభిరుచుల్లో మునిగిపోయారు. ఎవరికిష్టమైన పనుల్లో వారు తేలియాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల కశ్మీర్‌లో ఎక్కడ ఎలాంటీ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పన్నేండు రోజులు గడిచిపోయింది. ప్రజలు ఎవరి బిజిలో వారు మునిగిపోయారు.

ఇక జమ్ము కశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి,పునర్విభజనన జరిగిన తర్వాత, సాధరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే పునర్విభజన బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత కశ్మీర్‌లో ఉత్కంఠ నెలకోంది. దీంతో ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో ముందస్తు చర్యలను చేపట్టిన కేంద్రం కశ్మీర్ ప్రజలపై ప్రభావాన్ని చూపే నాయకులను పలువురు నాయకులను గృహనిర్భంధంలో ఉంచింది. దీంతో వారం రోజుల పాటు అనధికార కర్ఫ్యూను విధించిన రాష్ట్ర ప్రభుత్వం నెమ్మదిగా సెక్యూరిటి నిబంధనలను సడలించాయి. దీంతో విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు రీ ఒపెన్ అయ్యాయి. ఆదివారం నుండి పలు జిల్లాల్లో పూర్తిగా కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్దరించడంతో పాటు నిబంధనలు సడలించారు.

English summary
Omar Abdullah and PDP chief Mehbooba Mufti have been keeping themselves busy with video games and books.the two leaders were moved to separate locations to keep them from quarrelling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X