వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటకు రాను... గృహ నిర్భంధంలోనే ఉంటాము...! మహబుబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా...!

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత గృహ నిర్భంధంలోకి వెళ్లిన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబుబా ముఫ్తి, ఓమర్ అబ్ధుల్లా మొండికేశారు. ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినా.. తాము గృహ నిర్భంధం నుండి బయటకు వెళ్లమని తెగేసి చెప్పారు. కశ్మీర్‌లో సాధరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే గుృహ నిర్భంధంలో ఉన్న నేతలను బయటకు పంపిస్థామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఎలాంటీ ఆందోళనలు నిర్వహించవద్దని కండిషన్ పెట్టింది.. దీంతో ప్రభుత్వ ప్రతిపాదనను ఇద్దరు నేతలు తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే వారి నిర్భంధాన్ని కొనసాగిస్తున్నట్టు సమాచారం.

జమ్ము కశ్మీర్‌కు ఇప్పటివరకు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ.. కేంద్రం ఆగస్టు 5న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే, దీంతో కశ్మీర్‌లో ఎలాంటీ హింసాత్మక చర్యలు జరకుండా పలు ముందస్తు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేతలను అరెస్ట్ చేసి గృహనిర్భంధంలో పెట్టారు. మాజీ ముఖ్యమంత్రులు ఓమర్ అబ్దుల్లాతోపాటు ,మహబుబా ముఫ్తిలు కూడ నిర్భంధంలో ఉంచింది. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు శ్రీనగర్‌లో ప్రత్యేక అతిధి గృహంలో పెట్టారు.. ఇక అప్పటి నుండి కనీసం వారు బయటకు అడుగు పెట్టేందుకు కూడ వీలు లేని విధంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 370 ఆర్టికల్ రద్దు నుండి ఇప్పటి వరకు పెద్దగా ఆందోళనలు,హింసాత్మక సంఘటనలు జరిగిన పరిస్థితులు మాత్రం కనిపించలేదు.

Omar Abdullah and Mehbooba Mufti have rejected from their detention

ఈనేపథ్యంలోనే క్రమంగా కర్ఫ్యూను సడలించడంతోపాటు, సాధరణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో నిర్భంధంలో ఉన్న నేతలను తమ ఇళ్లకు పంపించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే విషయాన్ని మహబుబా ముఫ్తితో పాటు, ఒమర్ అబ్ధుల్లాలకు విషయాన్ని చేరవేసింది. బయటికి వెళ్లిన తర్వాత ఎలాంటీ ఆందోళనలకు అవకాశం ఇవ్వమని హమీ ఇవ్వాలని కోరింది. అప్పుడే అతిధి గృహంలోని నిర్భంధం నుండి తమ స్వంత ఇళ్లకు పంపుతామని చెప్పింది. ప్రభుత్వ ప్రతిపాదనను ఇద్దరు నేతలు తిరస్కరించినట్టు సమాచారం. దీంతో ఇద్దరిని శ్రీనగర్‌లోని హరినివాస్ అతిధి గృహంలోనే ఉంచారు. కాగా అక్కడ టీవీ చానళ్లతో అన్ని సౌకర్యాలను కల్పించారు.

English summary
former Jammu and Kashmir Chief Ministers Omar Abdullah and Mehbooba Mufti have reportedly rejected an offer by the administration to end their detention.The two leaders have been in detention since August 5 when the Centre abrogated the Jammu and Kashmir's special status under Article 370of the Constitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X