వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ట్రాఫిక్ పోలీసులకు భయపడరు, ఆయనను ఫాలో కండి: ఒమర్ అబ్దుల్లా ట్వీట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రయాణీకులు రోడ్లపై వెళ్లేటప్పుడు నిబంధనలు పాటించాలని చెప్పేందుకు జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీని ఉదాహరణగా తీసుకున్నారు. ఇటీవల ప్రధాని ప్రయాణిస్తున్న వాహనానికి చెందిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రధాని మోడీ ట్రాఫిక్‌ నిబంధనలు ఎలా పాటిస్తారో వివరిస్తూ ఒమర్‌ అబ్దుల్లా ట్విటర్‌లో ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మోడీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రచార కార్యక్రమం ముగించుకుని కారులో వెళుతున్నప్పుడు తీసిన ఫొటోను ఒమర్‌ ట్వీట్‌ చేశారు.

ఫొటోలో మోడీ సీట్‌ బెల్ట్‌ పెట్టుకుని కనిపించారు. ఈ విషయాన్ని ఒమర్‌ చెబుతూ.. 'ముందు సీట్లో కూర్చుని సీట్‌ బెల్ట్‌ పెట్టుకోనివారికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ప్రదాని మోడీ ముందు సీట్‌లో కూర్చున్నప్పుడు సీట్‌ బెల్ట్‌ పెట్టుకుంటారు. కానీ ఆయన ట్రాఫిక్‌ పోలీసులకు భయపడి సీట్‌ బెల్ట్‌ పెట్టుకోరు.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అందరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేందుకే ఆయన ఈ పోస్ట్ పెట్టారు.

English summary
Former Jammu and Kashmir chief minister Omar Abdullah has cited Prime Minister Narendra Modi’s example to promote use of safety belt while driving as well travelling in a car. ”To those who think they are too important (or too cool) to use a seat belt in the front seat,” Abdullah Tweeted. He also shared a picture of PM Modi and said, “Even the PM uses one and he doesn’t do it out of fear of traffic police.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X