బీజేపీతో పొత్తు అవసరం: ఒమర్... నేతలతో అమిత్ షా సమావేశం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అవసరాల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు అవసరమని జమ్మూ కాశ్మీర్ అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.
"రాష్ట్రానికి ఇచ్చే రూ. 44 వేల కోట్ల వరద సాయాన్ని పొందడానికి బీజేపీతో పొత్తు అవరసరమని జమ్మూ కాశ్మీర్ పీడీపీకి చెప్పాం" అని ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. దీంతో పాటు తాను సాయుధ బలగాల ప్రత్యేకాధికారుల చట్టాన్ని లేవనెత్తినప్పుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

ఐతే ఇప్పుడు ఇదే చట్టాన్ని అడ్డుపెట్టుకుని పీడీపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మంచిదే అని ఒమర్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇంకా జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.
జమ్మూ కాశ్మీర్ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ జమ్మూ కాశ్మీర్ నాయకులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చి 13 రోజులైనా ఇంకా ప్రభుత్వ ఏర్పాటుపై ఏ ఒక్క పార్టీకి కూడా స్పష్టతకు రాలేదు.
దీంతో పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తుకు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ సముఖంగా ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications