• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

"సుప్రీంకు" చేరిన ఆర్టికల్ 370..! పిటీషన్ దాఖలు చేసిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా..!!

|

న్యూఢిల్లీ/హైదరాబాద్ : కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు పట్ల నిరసన సెగలు రగులుతూనే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శనివారం న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేశారు. కశ్మీర్‌ను విభజిస్తూ.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు పట్ల భగ్గుమన్న సీపిఎం..!ఆగస్టు 15ను తెలంగాణ బ్లాక్‌ డేగా పాటించాలని పిలుపు..!! ఆర్టికల్‌ 370 రద్దు పట్ల భగ్గుమన్న సీపిఎం..!ఆగస్టు 15ను తెలంగాణ బ్లాక్‌ డేగా పాటించాలని పిలుపు..!!

కశ్మీరీల అభిప్రాయానికి వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని విభజించారని సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈనెల 5వ తేదిన పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కశ్మీర్ నేతలు న్యాయశాఖను ఆశ్రయిస్తారని వార్తలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే బీజేపీ ప్రభుత్వం కూడా న్యాయనిపుణలతో చర్చించి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా వ్యూహాలు రచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఒమర్‌ అబ్దుల్లా పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Omar Abdullah Moves SC On President Order On Kashmir..!

ఇదిలా ఉండగా జమ్ము కశ్మీర్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే రషీద్ ఇంజినీర్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసారు. ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం చేశారన్న ఆరోపణలు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఆయన్ను ఢిల్లీ పటియాలా కోర్టు లో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం ఈ నెల 14 వరకు కస్టడీలోకి తీసుకొమ్మని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఉగ్రవాదులతో సంబంధాలున్న మాజీ ఎమ్మెల్యే రషీద్ ను అరెస్టు చేసి రిమాండుకు పంపించింది. ఇదే అంశంపై ఉగ్రవాదుల కదలికల్లో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది.

రషీద్ అరెస్టుకు నిరసనగా దాడులు జరిగే అవకాశాలు లేకపోలేదని, భారత్ భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఏమరు పాటుగా ఉంటే సమస్యలు ఎదురౌతున్నాయని, ఎప్పకప్పుడు చురుగ్గా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసారు ఉన్నతాదికారులు.

English summary
The head of the national conference and former CM Omar Abdullah approached the Supreme Court on the decision of the Union Government to abolish article 370, which provides for autonomy to Jammu and Kashmir. In this regard, he filed a petition in the court on Saturday. Dividing Kashmir.. His petition stated that the Gazette notification issued by the President to terminate article 370 is unconstitutional.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X