వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచి నిర్ణయం, దౌత్యవేత్తగా అతను అద్భుతం: ఒమర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత విదేశాంగ నూతన కార్యదర్శిగా జై శంకర్ నియామకాన్ని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. భారత విదేశాంగ కార్యదర్శిగా జై శంకర్‌ను నియమించడం మంచి నిర్ణమయని ఆయన పేర్కొన్నారు.

Omar Abdullah welcomes Jaishankar's appointment as Foreign Secretary

వాజ్‌పేయి ప్రధాని మంత్రిగా ఉన్న సమయంలో ఒమర్ అబ్దుల్లా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో జై శంకర్ ప్రాగు అంబాసిడర్‌గా పని చేశారని గుర్తు చేసుకున్నారు. దౌత్యవేత్తగా అతను అద్భుతంగా పని చేస్తారని, దానిలో ఎటువంటి సందేహం లేదని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

జైశంకర్‌ భారత విదేశాంగ నూతన కార్యదర్శిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను తన ఛాంబర్‌లో కలుసుకున్నారు. ఇంత వరకు విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతా సింగ్‌ పదవీ కాలం ఇంకా 8 నెలలు మిగిలి ఉండగానే ఆమెను పదవి నుంచి తప్పించారు.

నరేంద్రమోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన నియామకాలపై మంత్రివర్గ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 1977 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి జైశంకర్ అమెరికాలో భారత రాయబారిగా ఉన్నారు. విదేశాంగ కార్యదర్శిగా ఆయన రెండేళ్ల కాలం ఈ పదవిలో కొనసాగుతారు.

English summary
Former Jammu and Kashmir Chief Minister Omar Abdullah has welcomed the appointment of S Jaishankar as Foreign Secretary, calling it an "excellent" decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X