వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొమ్మొకరిది..సోకొకరిది: మోడీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

సొమ్ము ఒకరిది...సోకు ఒకరిది అన్నట్లు తయారైంది మన దేశ ప్రధాని మోడీ విదేశీ ఖర్చులు. జూన్ 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోడీ 84 దేశాలను చుట్టి వచ్చారు. వీటన్నిటికీ అయిన ఖర్చు మొత్తం ప్రభుత్వం బయటపెట్టింది. మోడీ విమాన ఖర్చులు, విమానం మెయిన్‌టెనెన్స్ ఖర్చులు, హాట్‌లైన్ సదుపాయాలతో కలపి మొత్తం రూ.1484 కోట్లుగా తేలింది. మోడీ విదేశీ ఖర్చులపై రాజ్యసభలో సభ్యులు ప్రశ్నించగా... అందుకు సమాధానం ఇచ్చారు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్.

వీకే సింగ్ సభకు తెలియజేసిన సమాచారం ప్రకారం ప్రధాని ప్రయాణించే విమానం మెయిన్‌టెనెన్స్‌కు రూ. 1088.42 కోట్లు ఖర్చుకాగా... మోడీ వినియోగించిన చార్టర్డ్ ఫ్లైట్స్ ఖర్చు రూ.387.26 కోట్లు అయ్యిందని వీకేసింగ్ తెలిపారు. ఈ లెక్కలన్నీ 2014 జూన్ 15 నుంచి 2018 జూన్ 10 వరకు అని ఆయన స్పష్టం చేశారు. హాట్‌లైన్ కోసం ఖర్చు అయిన మొత్తం రూ.9.12 కోట్లు. అయితే విదేశీ పర్యటనల్లో మోడీ ఉండగా అప్పటి హాట్ లైన్ వివరాల ఖర్చులు మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. 2014 నుంచి 42 విదేశీ ప్రయాణాలు చేసిన మోడీ... ఇప్పటి వరకు మొత్తం 84 దేశాలను చుట్టేశారు.

OMG:Modis Foreign Travel Since 2014 Cost Rs. 1,484 Crore

2015-16లో ప్రధాని మోడీ 24 దేశాలను చుట్టేశారు. 2016-17లో 18 దేశాల్లో టూర్ చేసిన మోడీ...2017-18లో ఆయన 19 దేశాల్లో పర్యటించారు. 2014-15లో 13 దేశాల్లో మోడీ పర్యటించారు. 2014 జూన్ లో ప్రధానిగా తన తొలి విదేశీ పర్యటన భూటాన్‌లో చేశారు మోడీ. ఇక 2018లో 10 దేశాలను చుట్టేసిన మోడీ... చివరిగా గత నెలలో చైనాలో పర్యటించారు.

English summary
An expenditure of Rs. 1,484 crore was incurred on chartered flights, maintenance of aircraft and hotline facilities during Prime Minister Narendra Modi's visits to 84 countries since June 2014, according to the government.The details of PM Modi's foreign travel expenditure under the three heads were shared in the Rajya Sabha by Minister of State for External Affairs VK Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X