
ఒమిక్రాన్ - ‘బూస్టర్ డోస్’: ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకోవాలి? - 8 ప్రశ్నలకు సమాధానాలు

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆందోళనల నడుమ కరోనావైరస్ వ్యాక్సీన్ బూస్టర్ డోసుపై చర్చ జరుగుతోంది. ఈ డోసు ఎవరికి ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో చూద్దాం.
ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మూడో డోసు వ్యాక్సీన్ ఇవ్వబోతున్నట్లు డిసెంబరు 25న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
బూస్టర్ డోసుపై చాలా దేశాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని దేశాలు తమ ఆరోగ్య సిబ్బందికి మూడో డోసు టీకాలు ఇస్తున్నాయి. మూడో డోసుతో వైరస్ నుంచి ముప్పు మరింత తగ్గుతుందని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) కూడా వెల్లడించింది.
ఇంతకీ బూస్టర్ డోసు అంటే ఏమిటి? ఒమిక్రాన్ నుంచి ఇది ఎంతవరకు రక్షణ కల్పిస్తుంది? మూడో డోసు ఇవ్వాలని భారత్ ఎందుకు నిర్ణయం తీసుకుంది? ఈ డోసు తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి?
- కోవిడ్-19: కరోనావైరస్ లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లు ఉచితంగానే వేస్తున్నారా

1. బూస్టర్ డోస్ అంటే?
ఏదైనా ఒక వ్యాధిపై పోరాడేలా శరీరాన్ని సిద్ధం చేసేందుకు వ్యాక్సీన్లు అవసరం అవుతాయి. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ డోసుల వ్యాక్సీన్లను తీసుకోవాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తయిన తర్వాత తీసుకునే డోసును బూస్టర్ డోసుగా పిలుస్తారు. బూస్టర్ డోస్ అనేది మన చదువు లాంటిదేనని బీబీసీ హెల్త్, సైన్స్ ప్రతినిధి జేమ్స్ గళ్లఘెర్ తెలిపారు.
''మొదటి డోసు ప్రాథమిక స్కూల్ లాంటిది. అక్కడ మీరు అక్షరాలతోపాటు ప్రాథమిక విషయాలు తెలుసుకుంటారు. కానీ, ఇది సరిపోదు. ఆ తర్వాత మీరు మాధ్యమిక విద్య చదవాలి. ఆ తర్వాత కాలేజీ లేదా యూనివర్సిటీ విద్య’’అని ఆయన అన్నారు.
వైరస్‌ను అడ్డుకోవడంతోపాటు దానితో ఎలా పోరాడాలో రోగ నిరోధక వ్యవస్థకు నేర్పించడంలో బూస్టర్ డోసులు ఉపయోగపడతాయి.
2. బూస్టర్ డోస్ ఎవరికి ఇస్తారు?
ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లతోపాటు వైద్యుల సూచన మేరకు 60ఏళ్లకు పైబడిన వృద్ధులకు కూడా మూడో డోసు ఇవ్వబోతున్నారు.
దీని కోసం మొదటి రెండు డోసుల కోసం రిజిస్టర్ చేసుకున్నట్లే కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- Cowin app: కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకునేందుకు ఇప్పటికీ ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరా?
- కోవిడ్-19: డెల్టా, డెల్టా ప్లస్, లామ్డా వేరియంట్లు అంటే ఏమిటి... ఇవి వ్యాక్సీన్లకు లొంగుతాయా

3. భారత్‌లో బూస్టర్ డోసులు ఎందుకు అవసరం?
వ్యాక్సీన్లు సరిపడా అందుబాటులోకి వచ్చిన వెంటనే మూడో డోసు ఇవ్వడం మొదలుపెట్టాలని మొదట్నుంచీ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించిన తర్వాత, బూస్టర్ డోసుపై చర్చలు మరింత పెరిగాయి.
కరోనావైరస్ను అడ్డుకోవడానికి రెండు డోసుల వ్యాక్సీన్లు సరిపోవని బ్రిటన్‌లో నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో తేలింది. మూడో డోసు తీసుకుంటే కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు 75 శాతం వరకు తగ్గించుకోవచ్చని వెల్లడైంది.
అందుకే భారత్‌లోనూ మూడో డోసు వ్యాక్సీన్ ఇవ్వడం మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ అవినాశ్ భోండ్వే బీబీసీతో మాట్లాడారు.
''భారత్‌లో ఆరోగ్య సిబ్బంది రెండో డోసు వ్యాక్సీన్ తీసుకొని పది లేదా 11 నెలలకుపైనే అయ్యింది. అయితే, ఆరు నెలల తర్వాత శరీరంలో యాంటీబాడీల సంఖ్య తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. వ్యాక్సీన్ తీసుకుని మరీ ఎక్కువ సమయం అయితే, వైరస్ నుంచి రక్షణ తగ్గిపోతుంది. కాబట్టి ముప్పు ఎక్కువగా ఉండే ఆరోగ్య సిబ్బందికి మరో డోసు వ్యాక్సీన్ ఇవ్వాలి’’అని ఆయన అన్నారు.
- వ్యాక్సీన్ తీసుకోవడానికి వయో పరిమితిని మోదీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదు..
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
4. బూస్టర్ డోసు తీసుకోవడం ఎలా?
ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు భారత్‌లో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60ఏళ్లకు పైబడిన వారికి మూడో డోసు వ్యాక్సీన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- మీరు రెండో డోసు ఎప్పుడు తీసుకున్నారనే దాన్ని బట్టి, మూడో డోసు ఎప్పుడు ఇవ్వాలో నిర్ణయిస్తారు.
- మూడో డోసు తీసుకోవాలని మొదట కోవిన్ సిస్టమ్ నుంచి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది.
- ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత మూడో డోసు కోసం కోవిన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఈ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లేదా వ్యాక్సీన్ కేంద్రానికి వెళ్లి చేసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ తర్వాత వ్యాక్సీన్ కేంద్రంలో టీకా తీసుకోవచ్చు.
- మూడో వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత, బూస్టర్ డోసు తీసుకున్నట్లు కొత్త వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇస్తారు.

5. బూస్టర్ డోసుగా ఏ వ్యాక్సీన్ ఇస్తున్నారు?
బూస్టర్ డోసుగా ఏ వ్యాక్సీన్ ఇవ్వాలనే విషయంలో కాస్త గందరగోళం నెలకొని ఉంది. మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే ఈ విషయంలో స్పష్టతలేదని మీడియాతో చెప్పారు.
''బూస్టర్ డోసుగా ఏ వ్యాక్సీన్ ఇవ్వాలో కేంద్రం మాకు చెప్పలేదు. మేం కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం’’అని ఆయన అన్నారు.
అయితే, నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పాత్రం ఇదివరకు ఏ వ్యాక్సీన్ ఇచ్చారో అదే డోసును బూస్టర్‌గా ఇస్తారని చెప్పారు.
కానీ బూస్టర్ డోసుగా వేరే వ్యాక్సీన్ ఇస్తే మేలని, దీని వల్ల వైరస్‌తో రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పోరాడగలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమెరికా, బ్రిటన్లలో ఈ ''మిక్స్ అండ్ మ్యాచ్’’ అంటే బూస్టర్ డోసుగా వేరే వ్యాక్సీన్ ఇవ్వడంపై ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నారు.
మిక్స్ అండ్ మ్యాచ్ విధానంలో మూడో డోసుగా వేరే వ్యాక్సీన్‌ను ఇస్తే మేలని వ్యాక్సినేషన్ నిపుణుడు డాక్టర్ సంజయ్ మరాఠే బీబీసీతో అన్నారు.
''ఇదివరకు తీసుకున్న వ్యాక్సీన్‌నే మూడో డోసుగా ఇచ్చేకంటే, వేరే వ్యాక్సీన్‌ను ఇస్తే, శరీరంలో యాంటీబాడీల సంఖ్య పెరుగుతుంది. వైరస్ నుంచి మరింత రక్షణ ఉంటుంది’’అని ఆయన అన్నారు.
''కోవోవ్యాక్స్ అనుమతులకు సంబంధించిన ఇతర ప్రక్రియలను ప్రభుత్వం వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. దీంతో దీన్ని కూడా భారీగా ప్రజలకు ఇచ్చేందుకు అవకాశం వస్తుంది’’ అని దిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్ డయాబెటిస్ విభాగం డైరెక్టర్ అంబారీశ్ మిట్టల్ అన్నారు.
కోవీషీల్డ్‌ను తయారుచేసిన సీరం ఇన్స్టిట్యూట్.. కోవోవ్యాక్స్‌ను కూడా ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాక్సీన్ అత్యవసర వినియోగానికి అనుమతులు కూడా జారీచేశారు.

6. బూస్టర్ డోసుతో ఎంతవరకు రక్షణ ఉంటుంది?
మూడో డోసుతో ఎంతవరకు రక్షణ ఉంటుందనే అంశంపై బీబీసీతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ క్రిస్ స్మిత్ మాట్లాడారు.
''మనం ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. అయితే, మీ వయసు ఎంత? అనే దానిపై ఇది ఆధారపడుతుంది. ఎందుకంటే వయసు పెరిగేకొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అయితే, బూస్టర్ డోసుతో వైరస్ ముప్పు కచ్చితంగా తగ్గుతుంది''అని ఆయన చెప్పారు.
''మూడో డోసు తీసుకుంటే 80 శాతం వరకు రక్షణ ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే ప్రతి వంద మందిలో ప్రతి 80 మందికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఇవి రక్షణ కల్పిస్తాయి. అంటే మిగతా 20 మందికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకుతుందని కాదు. ఈ విషయంలో మనకు స్పష్టత లేదు''అని ఆయన వివరించారు.
- వ్యాక్సీన్ తీసుకోవడానికి వయో పరిమితిని మోదీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదు..
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
7. కోవిడ్ సోకిన తర్వాత కూడా బూస్టర్ డోసు అవసరం అవుతుందా?
''ఒకసారి కోవిడ్-19 సోకితే, వైరస్‌తో ఎలా పోరాడాలో మన రోగ నిరోధక వ్యవస్థకు అవగాహన వస్తుంది. మీలో రోగ నిరోధక స్పందనలు ఉంటాయి. మీ శరీరం యాంటీబాడీలను కూడా ఉత్పత్తి చేస్తుంది. అయితే, రక్షణ ఉంది కదా అని బూస్టర్ డోసు తీసుకోవడం మానేయకూడదు''అని క్రిస్ స్మిత్ అన్నారు.
''కోవిడ్ నుంచి కోలుకున్న 28 రోజుల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చు. దీంతో మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఫలితంగా మీకు ఎక్కువ రక్షణ ఉంటుంది.
8. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది?
అమెరికా, బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో ఇప్పటికే మూడో డోసును ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే, కొన్ని ఆఫ్రికా దేశాల్లో చాలామంది ప్రజలకు ఇప్పటివరకు తొలి డోసు కూడా అందలేదు.
దీంతో ధనిక దేశాల్లోని ప్రజలు మూడు, నాలుగో డోసులు తీసుకుంటుంటే, పేద దేశాల్లోని ప్రజలకు తొలి డోసు కూడా అందడం లేదని నిరసన వ్యక్తం అవుతోంది.
దీంతో అన్ని దేశాల ప్రజలకు మొదటి రెండు డోసులు అందించడమే లక్ష్యంగా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పిలుపునిస్తోంది. మూడు, నాలుగో డోసులు ఇచ్చేటప్పుడు, కనీసం మొదటి డోసు కూడా అందని పేద ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు కూడా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ అగ్ని 5: అణ్వాయుధాలను మోసుకెళ్లే ఈ క్షిపణిని చైనా లక్ష్యంగా తయారు చేసిందా?
- తన చిన్ననాటి జ్ఞాపకాలతో గ్రామం మ్యాప్ గీశాడు.. కిడ్నాప్ అయిన 30 ఏళ్ల తర్వాత కన్నతల్లిని కలిశాడు
- చైనా, భూటాన్ ఒప్పందంతో భారత్‌కు టెన్షన్ తప్పదా... 'చికెన్స్ నెక్' మీద డ్రాగన్ కన్ను పడిందా?
- చైనాలో ఏం జరుగుతోంది? షియాన్ నగరంలో ప్రజలను అర్థరాత్రి క్వారంటైన్‌కు ఎందుకు తరలిస్తున్నారు?
- భారత్ – చైనా: గల్వాన్ లోయ ఘర్షణలకు ఏడాది.. సరిహద్దుల్లో పరిస్థితి ఇప్పుడెలా ఉంది
- మరోసారి రష్యా నమ్మకం గెలుచుకున్న భారత్... అమెరికాను దూరం పెడుతోందా?
- టీ20 ప్రపంచకప్: పాకిస్తాన్ జర్నలిస్ట్ 'ఘోరమైన ప్రశ్న’.. సమాధానం ఇవ్వడానికి నిరాకరించిన అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మొహమ్మద్ నబీ
- పాశ్చాత్య దేశాలతో యుద్ధానికి రష్యా, చైనా రిహార్సల్స్ .. భవిష్యత్ యుద్ధాలు, ఆయుధాలు ఎలా ఉంటాయి?
- లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఇప్పుడు ఎలా ఉంది?
- భారత్-చైనా సరిహద్దు వివాదం: గల్వాన్ లోయలో ఘర్షణ వీడియోను విడుదల చేసిన చైనా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)