• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Omicron Variant: అంతర్జాతీయ విమానాల రాకపోకలపై వెనక్కి తగ్గిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా హడలెత్తిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం పునరాలోచనలో పడింది. ఓమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తి పరిస్థితులపై సమీక్షించాకే అంతర్జాతీయ ప్రయాణాలను పునరిద్దరించాలని నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఆదివారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమనా సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, కొత్తగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఓమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

Omicron Variant: Centre to review resumption of international flights

విమాన సర్వీసుల పునరుద్ధరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితిని సమీక్షించాకే సర్వీసుల పునరుద్ధరణ తేదీలపై నిర్ణయం తీసుకుంటామని హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ముఖ్యంగా రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అనుసరించాల్సిన టెస్టింగ్, నిఘాను కూడా సమీక్షించనున్టన్లు తెలిపారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్, ప్రధాని ముఖ్య సలహాదారు డాక్టర్ విజయ్ రాఘవన్, ఆరోగ్య, పౌర విమానయాన శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

దక్షిణాప్రికాలో వెలుగు చూసిన కరోనావైరస్ మహమ్మారి కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఈ వేరియంట్‌ వెలుగుచూసిన దేశాలను ఇప్పటికే 'రిస్క్' కేటగిరిలో పెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ దేశాలను భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక దేశాలు మళ్లీ ఆంక్షల విధిస్తున్నాయి. చాలా దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ధక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్‌వానా, జాంబియా, లెసాతో, జింబాబ్వే దేశాలకు వెళ్లొద్దని తమ పౌరులకు హెచ్చరికలు జారీచేశాయి. దీంతో ఓమిక్రాన్ వేరియంట్‌పై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ వ్యాప్తిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా అన్ని ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఓమిక్రాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు అందాయి. మరోవైపు, గతంలో కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే ఆంక్షలు విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఓమిక్రాన్ వేరియంట్ పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఓమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల క్వారంటైన్, వారి కదలికిలపై నిఘా, కరోనా వ్యాక్సినేషన్, టెస్టులు వేగవంతం సహా కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. ఈ వైరస్ వ్యాప్తి అధికమైతే అందుకు తగ్గట్లుగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల కిట్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కనుక టెస్టింగ్ సదుపాయాలను రాష్ట్రాలు దగ్గర పెట్టుకోవాలని సూచించింది.

ఇక హాట్‌స్పాట్‌లను గుర్తించడం తప్పనిసరి. ఎక్కువ కేసులు వచ్చిన క్లస్టర్‌ను గుర్తించి దాన్ని హాట్‌స్పాట్‌గా ప్రకటించాలి. ఆ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా టెస్టింగ్ చేయడం, పాజిటివ్ శాంపిళ్లను ఇన్సాకాగ్‌ పరిశోధనశాలకు పంపించాలి. ఆ ప్రాంతంలో పాజిటివిటీ రేటు ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం కూడా కీలకం. ఆరోగ్య సేవలను అందించడంలో ఏ మాత్రం ఆలస్యం కాకూడదు. దేశంలోని వేరియంట్లను గుర్తించేందుకు ఇన్సాకాగ్ ల్యాబొరేటరీలను స్థాపించింది ప్రభుత్వం. కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు వీలైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. కొవిడ్ వేరియంట్లపై తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించాలి.

వ్యాక్సినేషన్ గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇంటెన్సివ్ కంటైన్మెంట్, చురుకైన నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలంటూ రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం. అవసరమైతే కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలను పెంచాలని ఆదేశించింది. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు ఫోకస్ పెట్టాలి. కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలని, తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది.కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలను కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబులను వినియోగించుకోవాలని తెలిపింది. అలాగే, తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించేలా ప్రెస్ బ్రీఫింగ్, బులెటిన్లు విడుదల చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలపైనా ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

English summary
Omicron Variant: Centre to review resumption of international flights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X