• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Omicron Variant: రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, కీలక ఆదేశాలు, సూచనలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దక్షిణాప్రికాలో వెలుగు చూసిన కరోనావైరస్ మహమ్మారి కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.

రాష్ట్రాలకు కేంద్రం ఓమిక్రాన్ అలర్ట్

రాష్ట్రాలకు కేంద్రం ఓమిక్రాన్ అలర్ట్

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఈ వేరియంట్‌ వెలుగుచూసిన దేశాలను ఇప్పటికే 'రిస్క్' కేటగిరిలో పెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ దేశాలను భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక దేశాలు మళ్లీ ఆంక్షల విధిస్తున్నాయి. చాలా దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ధక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్‌వానా, జాంబియా, లెసాతో, జింబాబ్వే దేశాలకు వెళ్లొద్దని తమ పౌరులకు హెచ్చరికలు జారీచేశాయి. దీంతో ఓమిక్రాన్ వేరియంట్‌పై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ వ్యాప్తిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా అన్ని ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఓమిక్రాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు అందాయి. మరోవైపు, గతంలో కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే ఆంక్షలు విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఓమిక్రాన్.. రాష్ట్రాలకే కేంద్రం కీలక ఆదేశాలు

ఓమిక్రాన్.. రాష్ట్రాలకే కేంద్రం కీలక ఆదేశాలు

ఓమిక్రాన్ వేరియంట్ పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఓమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల క్వారంటైన్, వారి కదలికిలపై నిఘా, కరోనా వ్యాక్సినేషన్, టెస్టులు వేగవంతం సహా కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. ఈ వైరస్ వ్యాప్తి అధికమైతే అందుకు తగ్గట్లుగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల కిట్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కనుక టెస్టింగ్ సదుపాయాలను రాష్ట్రాలు దగ్గర పెట్టుకోవాలని సూచించింది.

హాట్ స్పాట్లు, క్లస్టర్లు.. వైద్య సదుపాయాలు..

హాట్ స్పాట్లు, క్లస్టర్లు.. వైద్య సదుపాయాలు..

ఇక హాట్‌స్పాట్‌లను గుర్తించడం తప్పనిసరి. ఎక్కువ కేసులు వచ్చిన క్లస్టర్‌ను గుర్తించి దాన్ని హాట్‌స్పాట్‌గా ప్రకటించాలి. ఆ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా టెస్టింగ్ చేయడం, పాజిటివ్ శాంపిళ్లను ఇన్సాకాగ్‌ పరిశోధనశాలకు పంపించాలి. ఆ ప్రాంతంలో పాజిటివిటీ రేటు ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం కూడా కీలకం. ఆరోగ్య సేవలను అందించడంలో ఏ మాత్రం ఆలస్యం కాకూడదు. దేశంలోని వేరియంట్లను గుర్తించేందుకు ఇన్సాకాగ్ ల్యాబొరేటరీలను స్థాపించింది ప్రభుత్వం. కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు వీలైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. కొవిడ్ వేరియంట్లపై తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించాలి.

  Omicron : PM Modi High Level Review On New Variant || Oneindia Telugu
  ఓమిక్రాన్.. అపోహలు, తప్పుడు ప్రచారాలు అరికట్టాలి

  ఓమిక్రాన్.. అపోహలు, తప్పుడు ప్రచారాలు అరికట్టాలి

  వ్యాక్సినేషన్ గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇంటెన్సివ్ కంటైన్మెంట్, చురుకైన నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలంటూ రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం. అవసరమైతే కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలను పెంచాలని ఆదేశించింది. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు ఫోకస్ పెట్టాలి. కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలని, తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది.కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలను కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబులను వినియోగించుకోవాలని తెలిపింది. అలాగే, తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించేలా ప్రెస్ బ్రీఫింగ్, బులెటిన్లు విడుదల చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలపైనా ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

  English summary
  Omicron Variant: More Testing, Check Hotspots, Centre Tells States On Omicron.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X