వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

omicron variant: డేంజరస్ మ్యూటేషన్స్; కరోనా మహమ్మారి గమనాన్నే మార్చొచ్చు; డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ మహమ్మారి గమనాన్ని మార్చగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వీలైనంత త్వరగా టీకాలు వేయాలని మరియు సంక్రమణ నుండి ప్రజలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఒమిక్రాన్ ప్రపంచ సంక్షోభంగా మారడాన్ని మనము నిరోధించగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం ఒక బ్రీఫింగ్‌లో అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ మారుతోంది, కానీ మన సామూహిక సంకల్పం మారకూడదు అని ఆయన పేర్కొన్నారు. డెల్టా స్ట్రెయిన్ కంటే ఒమిక్రాన్ తేలికపాటిదని ప్రారంభ సాక్ష్యాలు ఉన్నప్పటికీ, ఇది ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలు లేకుండా ఉందని, ఒమిక్రాన్ వేరియంట్ లో జరుగుతున్న ఉత్పరివర్తనాలు అందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ వెల్లడించారు.

ఒమిక్రాన్ వేరియంట్ లో అసాధారణ మ్యుటేషన్ పైనే టెన్షన్

ఒమిక్రాన్ వేరియంట్ లో అసాధారణ మ్యుటేషన్ పైనే టెన్షన్

ఒమిక్రాన్ యొక్క కొన్ని లక్షణాలు, దాని గ్లోబల్ స్ప్రెడ్ మరియు పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలతో సహా, ఇది మహమ్మారి పై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని సూచిస్తున్నాయి అని టెడ్రోస్ చెప్పారు. ఒమిక్రాన్‌ వేరియంట్ ను అర్థం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒమిక్రాన్ వేరియంట్లో అసాధారణ మ్యుటేషన్ ను గుర్తించిన నేపథ్యంలో కొత్త వేరియంట్ పై టీకాల ప్రభావశీలత తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మొత్తానికే టీకా నుంచి లభించే రక్షణను ఒమిక్రాన్ వేరియంట్ ఏమార్చలేదని వెల్లడించారు.

ప్రస్తుతం వ్యాక్సినేషన్ .. కరోనా జాగ్రత్తలు మాత్రమే మార్గం

ప్రస్తుతం వ్యాక్సినేషన్ .. కరోనా జాగ్రత్తలు మాత్రమే మార్గం


మన దగ్గర అత్యంత ప్రభావవంతమైన టీకాలు ఉన్నాయని, అన్ని రకాల వేరియంట్ లపై సమర్థవంతంగా పని చేసినట్లు నిరూపితమైంది అని, ఏదిఏమైనప్పటికీ ప్రస్తుతం అందరి ముందు ఉన్న ఆయుధం వాక్సినేషన్ తో పాటు తూచా తప్పకుండా కరోనా నిబంధనలు పాటించడం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొదటి దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికా నాల్గవ వేవ్ తో సతమతమవుతోంది. దక్షిణాఫ్రికాలో ప్రతి నలుగురిలో ఒకటికి కరోనా పాజిటివ్ గా తేలుతుంది. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇక సింగపూర్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తుంది. ఈ వేరియంట్ వల్ల రీ ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉందని వెల్లడించిన పరిస్థితి ఉంది.

పేద దేశాలకు మరిన్ని వ్యాక్సిన్ లను అందుబాటులో ఉంచేలా చూడాలని వినతి

పేద దేశాలకు మరిన్ని వ్యాక్సిన్ లను అందుబాటులో ఉంచేలా చూడాలని వినతి

ఫైజర్ మరియు బయోఎన్‌టెక్ ఒమిక్రాన్ వేరియంట్‌ను తటస్తం చేయడానికి వారి టీకా యొక్క మూడవ మోతాదు అవసరమని ప్రారంభ ప్రయోగశాల అధ్యయనాలు చూపిస్తున్నాయని, ఈ విశ్లేషణ ప్రపంచవ్యాప్తంగా బూస్టర్-షాట్ డ్రైవ్‌లను వేగవంతం చేస్తుందని పేర్కొంది. ఇనాక్యులేషన్ రేట్లు తక్కువగా ఉన్న పేద దేశాలకు మరిన్ని వ్యాక్సిన్‌లను అందుబాటులో ఉంచడానికి బూస్టర్‌లను నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాల పై ఒత్తిడి చేస్తోంది.

Recommended Video

Omicron Variant : NO Lockdown - Need To Follow Protective Measures | Guidelines || Oneindia Telugu
57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్

57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్

ఒమిక్రాన్ నుండి రక్షించడానికి మూడవ షాట్‌లు అవసరమని అధ్యయనాలు ఆధారాలు చూపుతూ ఉంటే వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనలు అనుసరిస్తారా అన్నది ప్రశ్నార్థకమే.
ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు 57 దేశాలకు వ్యాపించింది మరియు ఇది మునుపటి వైరస్ జాతుల కంటే ఎక్కువగా వ్యాపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ, డెల్టా కంటే ఒమిక్రాన్ ఎక్కువ ట్రాన్స్‌మిసిబిలిటీని కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ వైరస్ ఆపలేనిది అని దీని అర్థం కాదు అని వెల్లడించారు.

English summary
The World Health Organization says the omicron variant can change the course of the coronavirus epidemic. It called on the nations of the world to vaccinate as soon as possible and to take steps to protect people from infection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X