వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాత్రికి రాత్రే సెలవులపై పంపడం ఏమిటి: అలోక్ వర్మ పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీం కోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తనను కేంద్రం సెలవులపై పంపించడాన్ని వ్యతిరేకిస్తూ అలోక్ వర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టులో గురువారం కూడా వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. అత్యవసరంగా ఆయనను సెలవులపై పంపించడం మీద అడ్వోకేట్ జనరల్‌ను ప్రశ్నించింది.

జూలై నుంచి వారి అలోక్ వర్మ, రాకేష్ ఆస్తానాల మధ్య వివాదంపై ఓపికపట్టి ఆ తర్వాత అంత హఠాత్తుగా సెలవులపై ఎందుకు పంపించవలసి వచ్చిందని ప్రశ్నించింది.

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్తానాలను రాత్రికి రాత్రే ఎందుకు సెలవులపై పంపించారని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సీబీఐ చీఫ్ పైన ఇలాంటి నిర్ణయం తీసుకునే సమయంలో సెలక్షన్ కమిటీని ఎందుకు సంప్రదించలేదని అడిగింది.

సీపీఐ వర్సెస్ సీబీఐ: ఆస్తానా-వర్మ పిల్లుల్లా కొట్టుకున్నారు.. సుప్రీంకు ఏజీ సీపీఐ వర్సెస్ సీబీఐ: ఆస్తానా-వర్మ పిల్లుల్లా కొట్టుకున్నారు.. సుప్రీంకు ఏజీ

On Alok Vermas plea, SC says govts decisions should be in interest of CBI

కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఆలోక్ వర్మ, రాకేష ఆస్తానాలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పడిన పరిణామాలు రాత్రికి రాత్రి జరగలేదని, మీరు అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి కారణం అది కాదని సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్‌ గొగొయ్‌ అభిప్రాయపడ్డారు.

అనివార్య కారణాల వల్ల వారిని సెలవులపై పంపించవలసి వచ్చిందని ఏజీ బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపారు. గత కొన్ని నెలలుగా వారు ఘర్షణ పడుతుండటంతో సీబీఐ బాహాటంగా అపహాస్యం పాలైందని, అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

English summary
The Supreme Court Thursday resumed hearing CBI Director Alok Verma’s petition challenging a government order divesting him of all responsibilities. He was sent on leave, along with his deputy CBI Special Director Rakesh Asthana, after the two levelled allegations of corruption against each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X