వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి సంవత్సరం, కాంగ్రెస్ సహకరించింది. వచ్చే నాలుగేళ్లు నేనే సీఎం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెయ్యడానికి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం కుమారస్వామి అన్నారు.

ప్రజల మద్దతు

ప్రజల మద్దతు

ఒక సంవత్సరంలో తాము తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని సీఎం కుమారస్వామి గుర్తు చేశారు. ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం అని మంచి పేరు తెచ్చుకోవడంలో ఈ సంకీర్ణ ప్రభుత్వం శక్తి వంచనలేకుండా పని చేసిందని సీఎం కుమారస్వామి ఇదే సందర్బంలో చెప్పారు. ఈ సంవత్సరం తాము సంతృప్తిగా పని చేశామని, వచ్చే నాలుగు సంవత్సరాలు ఇదే విదంగా పని చేస్తామని సీఎం కుమారస్వామి వివరించారు.

రైతుల కష్టాలు

రైతుల కష్టాలు

రైతుల కష్టాలు గుర్తించి వారిని ఆదుకోవడానికి తమ సంకీర్ణ ప్రభుత్వం ముందడగు వేసిందని సీఎం కుమారస్వామి అన్నారు. రైతుల రుణమాఫి చెయ్యడంలో సంకీర్ణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని సీఎం కుమారస్వామి చెప్పారు. ఇప్పటికే 15. 5 లక్షల మంది రైతుల రుణమాఫి చేశామని సీఎం కుమారస్వామి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అర్హులైన రైతులు అందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.

యువతకు ఉద్యోగాలు

యువతకు ఉద్యోగాలు

కర్ణాటకలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని సీఎం కుమారస్వామి అన్నారు. బెంగళూరు నగరంతో పాటు అనేక నగరాలను అభివృద్ది చేశామని సీఎం కుమారస్వామి చెప్పారు. కర్ణాటక ఆర్థికంగా అభివృద్ది చెందడానికి శక్తివంచన లేకుండా పని చేశామని ఇదే సందర్బంలో సీఎం కుమారస్వామి వివరించారు.

ప్రభుత్వ పాఠశాలలు

ప్రభుత్వ పాఠశాలలు

ప్రభుత్వ పాఠశాలల్లో మూలభూతసౌకర్యాలు కల్పించడానికి ఈ సంకీర్ణ ప్రభుత్వం అధిక ప్రధాన్యత ఇచ్చిందని సీఎం కుమారస్వామి గుర్తు చేశారు. పేద విద్యార్థులను గుర్తించి వారికి అత్యున్నత వైద్య సేవలు అందించడానికి ప్రధాన్యత ఇచ్చామని కుమారస్వామి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులను ఆదుకోవడానికి అనే సంక్షేమ పథకాలు అమలు చేశామని సీఎం కుమారస్వామి చెప్పారు.

ప్రజల ప్రభుత్వం

ప్రజల ప్రభుత్వం

ప్రజలను ఆదుకోవడాని తాను ప్రవేశపెట్టిన అనేక పథకాలు అమలు కావడానికి సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పెద్దలు పూర్తిగా సహకరించారని ఇదే సమయంలో సీఎం కుమారస్వామి గుర్తు చేశారు. ప్రజలను అన్ని విదాలుగా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పని చేసిందని, అందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని సీఎం కుమారస్వామి వివరించారు.

కష్టాలు ఎదురైనాయి

కష్టాలు ఎదురైనాయి

తాను సీఎం అయిన తరువాత రాష్ట్రంలో వరదలు, భూకంపం వచ్చిందని సీఎం కుమారస్వామి గుర్తు చేశారు. ఆ సందర్బంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో అన్ని విదాలుగా ప్రజలు ఆదుకోవడంలో విజయం సాదించామని సీఎం కుమారస్వామి అన్నారు. గత రెండు నెలల నుంచి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు పరిస్థితులు అదుపులోకి తీసుకురావడానికి పని చేశారని, వారికి ఇదే సందర్బంలో ధన్యవాదాలు చెబుతున్నానని సీఎం కుమారస్వామి అన్నారు.

English summary
On completion of one year, Chief Minister HD Kumaraswamy message to people of Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X