వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ట్విస్ట్, సన్నిహితులు వెనక్కి!: వచ్చీ రాగానే బదలీలు రద్దు చేసిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ

|
Google Oneindia TeluguNews

Recommended Video

On first day back, CBI chief Alok Verma cancels transfers of loyalists | Oneindia Telugu

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ విధుల్లో చేరారు. 77 రోజుల తర్వాత సీబీఐలోని తన కార్యాలయానికి వచ్చిన ఆయనకు తాత్కాలిక సీబీఐ చీఫ్ నాగేశ్వర రావు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఆయనతో పాటు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్తానాను కేంద్ర ప్రభుత్వం సెలవుల పైన పంపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగేశ్వర రావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు.

నాగేశ్వర రావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రాగానే పలువురు అధికారులను బదలీ చేశారు. ఇప్పుడు అలోక్ వర్మ వచ్చీ రాగానే అంతే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ బదలీలను నిలిపివేశారు. అలోక్ వర్మ సెలవులపై వెళ్లిన తర్వాత, 2018 అక్టోబర్ 24వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు పలు బదలీలు జరిగాయి. ఆ బదలీలను క్యాన్సిల్ చేస్తున్నట్లు ఇప్పుడు వర్మ ప్రకటించారు.

బదలీలు రద్దు చేసిన అలోక్ వర్మ

బదలీలు రద్దు చేసిన అలోక్ వర్మ

అలోక్ వర్మ సెలవులపై వెళ్లాగనే నాగేశ్వర రావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం పలువురు అధికారులను బదలీ చేశారు. బుధవారం సీబీఐ కార్యాలయంలో అడుగుపెట్టిన అలోక్ వర్మ వాటన్నింటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, రాత్రి పొద్దుపోయే వరకు తన కార్యాలయంలోనే బిజీగా గడిపారు.

సీబీఐ వర్సెస్ సీబీఐ: కమిటీ నుంచి తప్పుకున్న అలోక్ వర్మ, సిక్రీ పేరు ప్రతిపాదన సీబీఐ వర్సెస్ సీబీఐ: కమిటీ నుంచి తప్పుకున్న అలోక్ వర్మ, సిక్రీ పేరు ప్రతిపాదన

క్యాన్సిల్ చేసిన వారిలో వీరు కూడా

క్యాన్సిల్ చేసిన వారిలో వీరు కూడా

బదలీ అయిన వారిలో అలోక్ వర్మ సన్నిహితులు కూడా ఉన్నారు. తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వర రావు బదలీ చేయగా, అలోక్ వర్మ క్యాన్సిల్ చేసిన వారిలో డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్ గుర్మ్, డీఐజీ ఎంకే సిన్హా, జాయింట్ డెరేక్టర్ ఏకే శర్మ తదితరులు ఉన్నారు.

కొద్ది రోజుల్లో ముగియనున్న పదవీకాలం

కొద్ది రోజుల్లో ముగియనున్న పదవీకాలం

కాగా, అలోక్ వర్మ పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. మరోవైపు ఆయన భవిష్యత్తును నిర్ణయించే అత్యున్నతస్థాయి కమిటీ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మరో సీనియర్ న్యాయవాది జస్టిస్ ఏకే సిక్రీని ప్రతిపాదించారు. అలోక్ వర్మ వెంటనే విధుల్లో చేరాలని, ఆయనను సెలవులపై పంపించడం తగదని మంగళవారం తీర్పు చెప్పిన ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ఉన్నారు. దీంతో అలోక్ వర్మ భవిష్యత్తును చెప్పే కమిటీ నుంచి తప్పుకున్నారు.

English summary
Seventy-seven days after he came back to office, CBI director Alok Verma reversed transfer orders of some of his key officers, who were sent out by interim chief M Nageshwar Rao while Verma was exiled on a forced leave.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X