వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2 నెలల క్రితమే కమల్ అడిగాల్సింది, నాతో రావాలని కోరారు: రజనీకాంత్ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సహ నటుటు కమల్‌హసన్‌తో కలిసి రజనీకాంత్ ఒకే వేదికను పంచుకొన్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య అంతగా సఖ్యత లేదని ప్రచారం సాగుతున్న తరుణంలో ఒకే వేదికను పంచుకొన్నారు. అంతేకాదు రాజకీయాలపై కమల్‌పై రజనీకాంత్ వ్యాఖ్యలు చేయడం విశేషం.

చెన్నైలో ప్రముఖ సినీనటుడు శివాజీ గణేశన్‌ స్మారక కేంద్రం ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ఒకే వేదికను పంచుకొన్నారు.. రాజకీయాల్లో విజయం సాధించాలంటే కీర్తిప్రతిష్టలు, ధనం మాత్రమే ఉంటే సరిపోదన్నారు. ఇంకేదో కావాలన్నారని రజనీకాంత్ అన్నారు.

On Kamal Haasan And Success In Politics, Rajinikanth's Joke

'రాజకీయ నాయకుడిగా విజయం సాధించాలంటే ఇప్పుడున్న కీర్తి ప్రతిష్టలు సరిపోవు. ఇంకా ఎక్కువ కావాలి. నాకు ఆ రహస్యం తెలీదు. బహుశా కమల్‌కు తెలుసని భావిస్తున్నా. గత రెండు నెలల క్రితమే కమల్‌ తనతో కలిసి పనిచేయాలని నన్ను అడిగి ఉండాల్సింది.' అని అన్నారు. 'రాజకీయాల్లో ఎలా విజయం సాధించాలని నేను కమల్‌ను అడిగాను. నాతో రా.. నేను చెబుతాను.' అని కమల్‌ చెప్పినట్లు రజనీ అన్నారు.

ఈ స్మారక కేంద్రాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ప్రారంభించారు. కమల్‌హసన్, రజనీకాంత్‌లు స్వంతంగా పార్టీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

English summary
The disappointment of Sivaji Ganesan's fans over the absence of Chief Minister E Palaiswami were almost forgotten today as both Rajinikanth and Kamal Hasaan shared stage at the inauguration of the Tamil superstar's memorial in Chennai. But Kamal Haasan, who has recently announced his intention to enter politics, touched upon the issue with a dig at the Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X